Begin typing your search above and press return to search.
ఐసిస్ రాక్షసుల మాదిరే పాక్ సైన్యం కూడా..
By: Tupaki Desk | 15 Jan 2017 10:34 AM GMTప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సైన్యం పాత్ర పరిమితంగా ఉంటుంది. అందుకు కాస్త భిన్నమైన పరిస్థితి దాయాది పాక్ లో ఉంటుంది. అయితే.. పాక్ సైన్యం ఆరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయం ఇప్పుడుప్రపంచానికి తెలీయటమే కాదు.. షాకింగ్ గా మారింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఎలా అయితే.. వ్యవహరిస్తారో.. పాక్ సైన్యం ఇంచుమించే అదే తరహాలో వ్యవహరిస్తుందన్న సంచలన విషయాన్ని బయటపెట్టారు పాస్తూన్ ఉద్యమవేత్త ఉమర్ ఖటక్.
పాక్ లోని స్వాత్ లోయ.. వజీరిస్తాన్ లలో పాక్ సైన్యం సాగిస్తున్న రాక్షసకాండకు అంతూపొంతూ లేకుండా పోతుందని.. సొంత గడ్డలోనే తమ ఉనికి లేకుండా చేస్తున్న విషయాన్ని ఉమర్ ఖటక్ మీడియాకు వివరించారు. పాస్తూన్ బాలికల్ని పెద్ద ఎత్తున అపహరించుకుపోయి.. వారిని సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని.. తమ ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేతకు పాల్పడుతున్నారని.. మహిళలపై పెద్ద ఎత్తున అకృత్యాలకు దిగుతున్నట్లుగా ఆరోపించారు.
వందలాది మంది పాస్తూన్ బాలికల్ని ఇళ్లల్లో నుంచి బలవంతంగా తీసుకెళుతున్న పాక్ సైనికుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. అవసరమైతే తమపైన అణుదాడిని జరిపేందుకు సైతం పాక్ పాలకులు సిద్ధంగా ఉన్నట్లుగా భయాందోళనలు వ్యక్తం చేశారు. పాక్ సైనికుల దారుణాల్ని భరించలేక ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ఆప్ఘనిస్తాన్ కు వెళ్లిపోయినట్లు యూఎన్ హెచ్ఆర్ సీ నివేదిక వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.
పాక్ సైన్యం చేస్తున్న దారుణాల్ని ఎదిరించేందుకు..తమ ప్రాంత ప్రజల్ని రక్షించుకునేందుకు వీలుగా.. పాస్తునిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉమర్ ఖటక్ వెల్లడించారు. తమకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని.. అండగా నిలవాలన్న ఆయన.. పాక్ తన వద్దనున్న అణుపాటవాన్ని చెడ్డ దేశాలకు అమ్మేందుకు సైతం బరితెగిస్తోందన్న తీవ్ర ఆరోపణ చేశారు. ఖటక్ మాటల్ని విన్నప్పుడు పాస్తూన్ ప్రజల పాలిట పాక్ సైన్యం.. మరో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులుగా మారినట్లుగా అనిపించక మానదు.