Begin typing your search above and press return to search.
పాక్ పత్రిక ప్రశ్న; పాక్ ఏర్పడింది ఇందుకేనా?
By: Tupaki Desk | 15 Aug 2015 5:24 AM GMTమనకంటే ఒక రోజు ముందు స్వాతంత్య్రం పొందిన పాకిస్థాన్ లోని ఒక ప్రముఖ దినపత్రిక వేసిన ప్రశ్న.. ఆ దేశంలోని పరిస్థితిని చెప్పకనే చెప్పేస్తుంది. 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని.. పాక్ దేశపు ప్రముఖ పత్రిక తన ఎడిటోరియల్ లో పాకిస్థాన్ ఎందుకు ఏర్పడింది? అన్న పేరు మీద ఒక వ్యాసం రాశారు. న్యూ రోడ్ మ్యాప్ అనే అర్టికల్ లో పాక్ ఏర్పడిన ఉద్దేశం నీరు కారిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
మైనార్టీల హక్కుల రక్షణ లక్ష్యంగా ఏర్పడిన దేశం.. నానాటికీ ఆ లక్ష్యానికి దూరమవుతుందని వాపోయారు. పాక్ పితామహుడు మహ్మాద్ ఆలీ జిన్నా.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇచ్చిన సందేశంలో.. ఆచార సంప్రదాయాల ప్రకారం హిందువులు హిందువులుగా.. ముస్లింలు ముస్లింలుగా ఉంటారని అయితే.. రాజకీయపరంగా మాత్రం అందరూ దేశ పౌరులే అని వ్యాఖ్యానించిన వ్యాఖ్యను పత్రిక కోట్ చేయటం చూస్తే.. పాక్ పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది.
జిన్నా చెప్పిన లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకున్నామని ప్రశ్నించిన ఆ పత్రిక.. మైనార్టీల హక్కులు కాపాడలేకపోవటాన్ని ప్రస్తావిస్తూ.. దేశం ఏర్పడిన లక్ష్యాన్ని విస్మరించటమేనని సూటిగా నిలదీసింది. సరైన చట్టాలు లేకపోవటమే ఇలాంటి పరిస్థితి కారణమని పేర్కొంది.
ఇలాంటి సమయంలో ఆగస్టు 11న దేశంలోని మైనార్టీలకు ప్రత్యేక హక్కులు కల్పించాలంటూ పార్లమెంటు తీర్మానించటం ఒక శుభ పరిణామంగా పేర్కొన్న పత్రిక.. తాజా నిర్ణయంతో అయినా.. దేశంలోని మైనార్టీలకు సమాన హక్కులు.. సమాజంలో రక్షణ కలుగుతందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్లకు కూడా దేశంలోని వారందరికి సమాన స్వేచ్ఛ.. స్వాతంత్ర్యాలు లభించకపోవటానికి మించిన విషాదం ఇంకేం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. సంతోషించాల్సిన అంశం ఏమిటంటే దేశంలోని వాస్తవ పరిస్థితిని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అయినా ఒక ప్రముఖ పత్రిక ప్రస్తావించటం కొంతలో కొంత మేలు.