Begin typing your search above and press return to search.
అవును..మాది టెర్రరిస్థానే అన్న పాకిస్థానీయుడు
By: Tupaki Desk | 27 Sep 2017 4:30 AM GMTదాయాది పాక్ పై భారత్ చేసిన వాదనకు పాకిస్థాన్ లో అనూహ్య మద్దతు లభిస్తోంది. పాక్ సర్కారు చేసే పాపాల్ని బయటపెట్టిన భారత్ వాదనలో నిజం ఉందన్న విషయాన్ని పాకిస్థానీయులు అవునన్న మాటను చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక అధికారి అయితే ఏకంగా కోర్టు మెట్లు ఎక్కటం ఇప్పుడు సంచలనంగా మారింది.
దాయాది పాకిస్థాన్ ను టెర్రరిస్థాన్ అంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు నిజమంటూ పాక్ పౌరుడు ఒకరు ఒప్పుకోవటమే కాదు.. దీని సంగతి చూడాల్సిందిగా ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పాక్ నిఘా వర్గంలో పని చేసే అధికారి ఒకరు.
ఉగ్రవాదులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని.. వారిని శిక్షించాలని కోరారు. పాక్ నిఘా విభాగమైన ఏఎస్ ఐలో పని చేసే మాలిక్ ముక్తార్ అహ్మద్ షాజాద్ తాజాగా ఒక పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేశారు. ఇందులో దేశంలో పని చేసే స్వదేశీ.. విదేశీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వివరాల్ని తాను ఇచ్చానని.. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదని.. దేశ భద్రతతో ముడిపడిన ఈ అంశాన్ని ఐబీ చీఫ్ కు కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు.
ఉగ్రవాదులతో అధికారులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా తన దర్యాప్తులో తేలిందని.. ఈ కారణంగానే తన నివేదికపై చర్యలు తీసుకోవటానికి వారు వెనుకాడుతున్నట్లుగా వెల్లడించారు. జాయింట్ డైరెక్టర్ జనరల్.. డైరెక్టర్లు.. అసిస్టెంట్ డైరెక్టర్ల హోదాలో ఉన్న అధికారులు బయట దేశాల నుంచి జీతాలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇజ్రాయెల్.. అప్ఘానిస్థాన్ నిఘా సంస్థలకు ఉప్పందిస్తున్నవారి వివరాలు కూడా తన దగ్గర ఉన్నాయని ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.