Begin typing your search above and press return to search.
సౌదీ చక్రం..అభినందన్ విడుదలకు మార్గం సుగమం
By: Tupaki Desk | 28 Feb 2019 11:49 AM GMTభారత పైలెట్ - పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విషయంలో పాక్ దోబూచులాట కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తే అభినందన్ ను ఇండియాకు అప్పగిస్తామని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహముద్ ఖురేషి వెల్లడించారు. అయితే, అభినందన్ ను అప్పగించడానికి సిద్ధమని పాక్ మంత్రి వెల్లడించడం వెనుక సౌదీ క్రౌన్ ప్రిన్స్ చక్రం తిప్పడం కారణమని పలువురు పేర్కొంటున్నారు.
పైలట్ అప్పగింత విషయంలో పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నామని ఖురేషి అన్నారు. ఒక వేళ భారత ప్రధాని మోదీ చర్చలకు సిద్ధంగా ఉంటే తమ ప్రధాని ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి - ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. యుద్ధం జరిగితే పాక్ కే నష్టం జరుగుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాదా? అని ఖురేషి లాజిక్ పాయింట్ తీశారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ స్పందిస్తూ అభినందన్ విడుదల అంశంపై మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని వెల్లడించారు. యుద్ధ ఖైదీ హోదాలో విడుదల చేయాలా? లేదా అన్న కోణంలో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆధీనంలో ఉన్న అభినందన్ ఆరోగ్యంగా - సురక్షితంగా ఉన్నాడని స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తమ భూభాగంలో అభినందన్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యాడని ఆరోపించారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చర్యల వల్లే పాక్ అప్పగింత మంత్రం జపిస్తోందని టాక్. సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాక్ పర్యటనకు వెళ్లారు. సుమారు 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను సౌదీ అరేబియా ప్రకటించడం ఇదే తొలిసారి. అనంతరం భారత్‌లో పర్యటించిన సల్మాన్ మన దేశంతోనూ సత్సంబంధాలు కోరుకున్నట్లు తెలిపారు. కాగా, తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య సఖ్యత ఉండాలని - ఇదే తాము కోరుకుంటున్నామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తమ ముస్లిం దేశాల్లో బలమైన రాజ్యం, తమ దేశంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన వారి మాటకు గౌరవం ఇస్తూ పాక్ అభినందన్ విడుదలకు ముందుకు వచ్చినట్లు సమాచారం.