Begin typing your search above and press return to search.

లాడెన్ గురించి ముందే తెలుసు

By:  Tupaki Desk   |   14 Oct 2015 6:46 AM GMT
లాడెన్ గురించి ముందే తెలుసు
X
పాక్ వ‌క్రబుద్ధి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఉగ్ర‌వాదాన్ని పాక్ పెంచి పోషిస్తోంద‌ని చెప్పినా.. త‌మ‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. త‌మ దేశంలో అటువంటిదేమీ లేద‌ని ఎన్నోసార్లు బుకాయించింది. పాకిస్తాన్ స్వ‌యంగా ఉగ్ర‌వాదుల‌కు అండ‌గా ఉంటోంద‌ని అగ్ర‌దేశాల‌కు తెలిసినా వారు కూడా మిన్న‌కుండా ఉండి ప‌రోక్షంగా పాక్‌కు ఎన్నోసార్లు స‌పోర్ట్ చేశారు. పాక్ ఎంతోమంది ఉగ్ర‌వాదుల‌ను త‌న క‌డుపులో దాచుకుని పైకి మాత్రం ఎదుటివారిపై నింద‌లు వేసేది. కానీ ఇప్పుడు ఆ దేశ మాజీ ర‌క్ష‌ణ శాఖ మంత్రి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో పాక్‌ కు గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్ట‌యింది.

అమెరికాలో ప్ర‌పంచ వాణిజ్య సంస్థ భ‌వనాన్ని విమానాల‌తో కూల్చేసిన ఆల్‌ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్‌ కు మందే తెలుస‌ని ఆదేశ మాజీ ర‌క్ష‌ణ శాఖ మంత్రి చౌద‌రీ అహ్మ‌ద్ ముక్తార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశ‌మే అత‌డికి ఆశ్ర‌యం కూడా ఇచ్చింద‌ని వెల్ల‌డించారు. ఓ భార‌తీయ టెలివిజ‌న్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌న‌ 2008 నుంచి 2012 మధ్య పాక్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ డైరెక్టర్ జనరల్ పర్వేజ్‌ ముషార‌ఫ్‌, రషీద్ ఖురేషి తీవ్రంగా ఖండించారు. అహ్మద్ ఒక అబద్ధాలకోరు అని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒసామా బిన్ లాడెన్ త‌మ దేశంలో ఉన్న‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కూ తెలియ‌ద‌ని వివ‌రించారు. 'అహ్మద్ ముక్తార్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారంటే నమ్మలేకపోతున్నాను. నిజంగా ఈ మాటలు ఆయ‌న అన్నారంటే ముక్తార్ కు ఏదో అయి ఉంటుంది. ముక్తార్ వ్యాఖ్యలతో పాకిస్థాన్ విస్మ‌యానికి గురైంది. అయితే పాక్ అధ్యక్షుడికి నాటి లాడెన్ గురించి ముందే తెలుసు అని అన్నట్లు నేను మాత్రం వినలేదు' అని రషీద్ ఖురేషి అన్నారు.త‌మ‌కు లాడెన్ గురించి తెలియద‌ని. త‌మకు తెలియ‌కుండానే అమెరికా ద‌ళాలు పాకిస్థాన్‌లోని లాడెన్ నివాసంపై దాడి చేసి హ‌త‌మార్చాయ‌ని పాక్ ఇప్ప‌టివ‌ర‌కూ చెబుతూ వ‌చ్చింది. మ‌రి లాడెన్ చ‌నిపోయిన నాలుగున్న‌ర ఏళ్ల‌కు ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌పంచానికి పాక్ వైఖ‌రి ఎలాంటిదో తెలుస్తుందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.