Begin typing your search above and press return to search.
పాక్ అధ్యక్షుడి నోట ‘కశ్మీర్ స్వాతంత్ర్యం’ మట
By: Tupaki Desk | 15 Aug 2016 6:16 AM GMTఒకటి తర్వాత ఒకటిగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత దూకుడుగా భారత్.. పాక్ లు కశ్మీర్ ఇష్యూ మీద వ్యాఖ్యలు చేస్తున్నాయి. కశ్మీర్లో కొంత భాగం పాక్ వశం అయ్యాక.. ఇప్పటివరకూ మరే దేశ ప్రధాని ప్రస్తావించనంత తీవ్రంగా ఆక్రమిత కశ్మీర్ గురించి ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి పెదవి విప్పటానికి ప్రధాని స్థానంలో ఉన్న నేత ఎవరూ మాట్లాడని దుస్థితి.
అందుకు భిన్నంగా ప్రధాని మోడీ ఈ అంశంపై ఏకంగా అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయటమే కాదు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ భాగమని.. ఈ విషయం గురించి తాము తరచూ మాట్లాడాతమన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం పరిచయం లేని పాక్ కు ఇదో షాక్ గా మారింది. భారత్ దూకుడుకు కళ్లెం వేయాలన్న వ్యూహంతో కశ్మీర్ విషయం మీద శృతి మించిన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసేందుకు సిద్ధమవుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ద్వారా.. భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది.
నిన్నటికి నిన్న వాఘా దగ్గర స్వీట్లు పంచిన పాక్ సైనికులు (పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా).. మరో దగ్గర కాల్పులకు తెగ బడటాన్ని మర్చిపోకూడదు. ఇదొక్కటే కాదు.. నిన్నటి పాక్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ అధ్యక్షుడు ముమ్మూన్ హుస్సేన్ మాట్లాడుతూ.. కశ్మీరీలకు స్వాతంత్ర్యానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ స్వాతంత్ర్యానికి అంకితమిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.
కశ్మీరీల త్యాగాలు మట్టిపాలు కావని భావిస్తున్నానని.. ప్రస్తుతం కొనసాగుతున్న అల్లర్లు త్వరగా తగ్గాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. పాక్ అధ్యక్షుడి మాటలు చూస్తే.. కశ్మీరీలకు దన్నుగా నిలుస్తున్నామన్న సందేశాన్ని ఇవ్వటం కాదు.. భారత్ కానీ ఆక్రమిక కశ్మీర్ గురించి మాట్లాడితే.. తాము కశ్మీర్ గురించి మాట్లాడి రచ్చ చేస్తామన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. ఏది ఏమైనా గతంతో పోలిస్తే.. కశ్మీర్ ఇష్యూలో అవసరానికి మించిన అత్యుత్సాహాన్ని పాకిస్థాన్ ప్రదర్శిస్తుందనటంలో సందేహం లేదు. దీనికి మోడీ ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.