Begin typing your search above and press return to search.
పాత ఫొటోలతో దాడి.. పాక్ పన్నాగం..
By: Tupaki Desk | 27 Feb 2019 6:13 AM GMTభారత్ వాయుసేన దాడి నేపథ్యంలో పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ తన ఉనికిని చాటుకునేందుకు అబద్దపు ప్రచారాన్ని మొదలు పెట్టింది. గతంలో జరిగిన ఘటనలను తెరపైకి తీసుకొచ్చి తన అస్తిత్వాన్ని చాటుకోవాలని చూస్తోంది.
బుధవారం ఉదయం రెండు భారత జెట్ విమానాలను కూల్చివేసినట్టు పాకిస్తాన్ కలరిచ్చింది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. అయితే ఆ ఫొటోలు ఫేక్ అని భారత ఉన్నతాధికారులు తేల్చారు. గతంలో జరిగిన దాడులు - పాకిస్తాన్ పోస్టు చేసిన ఫొటోలను పోల్చి పాకిస్తాన్ నాటకాలాడుతోందని వివరించారు.
భారత్ సాక్ష్యాధారాలతో నిరూపించడంతో పాకిస్తాన్ విమానాలు కూల్చిన ఘటన ఫేక్ అని తేలిపోయింది. గతంలో జోధ్ పూర్ లో జెట్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఫొటోను షేర్ చేసి పాకిస్తాన్ ఇప్పుడు కూల్చామని చెప్పుకొచ్చింది. ఇటీవల బెంగళూరులో కూలిన రెండు ఫైట్లలో ఒక ఫొటోను కూడా పాకిస్తాన్ షేర్ చేసి తామే కూల్చామని చెప్పుకోవడం విశేషం. అయితే భారత్ సాక్ష్యాధారాలతో నిరూపించడంతో పాకిస్తాన్ ది తప్పుడు కథనాలు అని నిరూపించినట్టైంది.