Begin typing your search above and press return to search.

ఆ వాట్సప్ గ్రూప్ అడ్మిన్.. ముఖ్యమంత్రి!

By:  Tupaki Desk   |   2 Aug 2016 5:33 AM GMT
ఆ వాట్సప్ గ్రూప్ అడ్మిన్.. ముఖ్యమంత్రి!
X
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉండి వాట్సప్ ఆప్ లేని జనాలు ఉండరంటే అది అతిశయోక్తి కాదేమో. ఆ రేజం లో వాట్సప్ దూసుకుపోతుంది. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ఎవరికి తోచిన స్థాయిలో, వారి వారి సర్కిల్స్ ని బట్టి గ్రూపులు కూడా మెయింటెన్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ గ్రూప్స్ - ఫ్యామిలీ గ్రూప్స్ - కొలీగ్స్ గ్రూప్స్ - కంపెనీ గ్రూప్స్ - విలేజ్ పేరుమీద ఒక గ్రూప్ ఇలా రకరకాల గ్రూప్ లు వాట్సప్ లో క్రియేట్ చేసుకుని ఒకే సమయంలో, ఒకే విషయాన్ని అందరికీ షేర్ చేసుకుంటుంటారు. ఇది చాలామంది నిత్యం చేసే పనే.. అయితే ఆ పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుంది. ఆ గ్రూప్ కి ఆయనే అడ్మిన్ అయితే.. ఇది మరీ డిఫరెంట్ గా ఉంది కదా.. ఈ వింత పక్క దేశం పాకిస్థాన్ లో జరిగింది.

వివరాళ్లోకి వెళితే... పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో సుపారిపాలన కొసమని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని భావించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికోసం తన సహచర సభ్యులతో సలిసి సమాచారం ఇచ్చుపుచ్చుకోవాలను నిర్ణయించుకున్నారు. దానికోసం వెంటనే ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూపులో మంత్రులు - సలహాదారులు - ప్రత్యేక సహాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ గ్రూప్ పేరు "కేబినెట్".. ఈ గ్రూపు అడ్మిన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే!!

కేబినెట్‌ లోని మంత్రులంతా తమ తమ కార్యకలాపాల వివరాలు ఈ వాట్సప్‌ గ్రూపులో తెలియజేయాలి, అదే సమయంలో వారి వారి పరిధిలో ఉన్న సమస్యల గురించి కూడా ఈ గ్రూపులో ఎప్పటికప్పుడు తెలపాలి అని ఆదేశించారు ఈ గ్రూప్ అడ్మిన్.. సీఎం. ఇదే సమయంలో తమ పర్యటనలు - సమావేశాలకు సంబంధించిన ఫొటోలు - వాటి పూర్తి వివరాలన్నింటినీ మంత్రులు ఈ గ్రూపులో షేర్ చేస్తున్నారట. వాటిపై నేరుగా సీఎం స్పందిస్తారని, అవసరమైన మేర స్పాట్ లోనే సూచనలు చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా.. ఈయన పాకిస్థాన్ లోని స్మార్ట్ సీఎం ఏమో!!