Begin typing your search above and press return to search.
ఖాన్ కాబట్టే జైలు అంటూ కారుకూతలు కూసేశాడు
By: Tupaki Desk | 6 April 2018 9:47 AM GMTచిన్న ఛాన్స్ దొరికితే చాలు భారత్ మీద విద్వేషం వెళ్లగక్కటంతో దాయాది పాకిస్థాన్ ఏ మాత్రం వెనుకాడదు. నిజం.. అబద్ధమన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటంలో పాక్ నేతలు ముందుంటారు. ఇందుకు తగ్గట్లే తాజాగా పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ఖవాజా అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో జోధ్ పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలుశిక్షను ఖరారు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో మైనార్టీలపై వివక్ష ఉంటుందని.. వారికి ఆ దేశంలో రక్షణ ఉండదని మరోసారి రుజువైందన్నారు.
సల్మాన్ పేరు చివరన ఖాన్ అన్న పదం లేకుంటే తీర్పు వేరేలా వచ్చేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ లోని అధికార పార్టీ మతాన్ని సల్మాన్ కలిగి ఉండే ఈ శిక్షకు అనర్హుడై ఉండేవాడని ఆరోపించారు. ఒకవేళ అదే నిజమైతే.. ఇదే సల్మాన్ పై గతంలో హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా ఎందుకు బయటపడేవాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం సల్మాన్ ఉంటున్న జైల్లో.. ఆయన పక్క సెల్ లో ఉన్న ఆశారాం బాపూజీ జైల్లో ఎందుకు ఉన్నట్లు?
అర్థం లేని మాటలు చెప్పటం.. లాజిక్ కు అందరి రీతిలో.. ఏదో రకంగా రెచ్చగొట్టాలన్న లక్ష్యం తప్పించి మరింకేమీ లేనట్లుగా పాక్ మంత్రి మాటలు ఉన్నాయని చెప్పాలి. ఇదే విషయాన్ని రుజువు చేస్తూ.. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సల్మాన్ ఖాన్ అతని మంతంపై మీకు అంతలా ప్రేమ ఉంటే.. ఆ హీరో సినిమాలు ఏక్తా టైగర్.. టైగర్ జిందాహై చిత్రాల్ని పాక్ థియేటర్లలో ఎందుకు ఆడనివ్వలేదు? అని ప్రశ్నించారు. ఇదే కేసులో నిర్దోషిగా బయటపడిన సైఫ్ అలీఖాన్ ది ఏ మతమో మంత్రి చెప్పాలంటూ మరో ట్వీట్ లో ప్రశ్నించారు. భారత్ లో అందరూ సమానమేనని.. ఆక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు జైలుశిక్ష విధించటం.. ఆయన దాన్ని అనుభవించటం తెలిసిందే. ఇదే విషయాన్ని మరొకరు ట్వీట్ ద్వారా గుర్తు చేశారు.
ఇలా సున్నితంగా మాట్లాడటమే కాదు.. కాస్త ఘాటుగా స్పందించిన వారూ లేకపోలేదు. ఒక నీచ దేశానికి మంత్రిగా పని చేస్తున్నావ్..పిచ్చివాడిలా మాట్లాడుతున్నావ్.. ముందు పాక్ లో ఉన్న సమస్యలు పరిష్‌కరించు.. తర్వాత పరాయి దేశాల గురించి ఆలోచించు అంటూ మరో నెటిజన్ ట్విట్టర్ లో మండిపడ్డారు. కదిలించుకొని మరీ తిట్టించుకోవటంలో పాక్ ప్రముఖులకు చేతనైనంత బాగా మరెవరికీ తెలీదేమో?