Begin typing your search above and press return to search.
మిస్సైల్ స్పెషల్... భారత్ - పాక్ బలాలు!!
By: Tupaki Desk | 1 Oct 2016 5:00 AM GMTఫ్లూటూ జింక మూదు ఊదు.. సింహం ముందు కాదు అనేది తెలుగు సినిమాలో డైలాగ్. ఇది ప్రస్తుతం భారత్ ముందు తాటాకు చప్పుళ్లు చేస్తున్న పాక్ కు సరిగ్గా సరిపోతుంది. తమవద్ద ఉన్న మిస్సైల్స్ ని చూసుకుని తెగ హడావిడి చేస్తున్న పాక్ కు - మాటలు కట్టిపెట్టి సైలంటుగా పని చేసుకుంటూపోతున్న భారత్ కు యుద్ధం వస్తే ఏమి జరుగుతుంది. ఏ మిస్సైల్స్ - అణ్వాయుధాలు చూసుకుని పాక్ మిడిసిపడుతుందో వాటి మేటర్ - భారత్ శక్తి ముందు ఎంత? ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాక్ కు ఇప్పటికే సెరికల్ స్ట్రైక్ తో ఒక షాకిచ్చింది ఇండియన్ ఆర్మీ. ఈ షాక్ తో భారత్ శక్తిసామర్ధ్యాలు - దమ్ము మరోసారి పాక్ కు తెలిశాయి. అయినా కూడా మేకపోతు గాంభీర్యపు మాటలు మానడం లేదు పాక్. అద్దె దైర్యంతో అరుస్తుంది - ఏదో చూసుకుని రంకెలేస్తుంది. ఇంతకూ ఏమి చూసుకుని పాక్ కు ఇంత దైర్యం? అని ఆలోచిస్తే... మా బలం ఇదంటు పాక్ మీడియా కథనాలు వడ్డించేస్తుంది. ఈ క్రమంలో భారత్ తో యుద్దమంటూ వస్తే పాక్ ముందుగా తీసుకునే నిర్ణయాల్లో ప్రధానమైంది అణ్వాయుధాలు - మిసైల్ ప్రయోగం. ఈ మేరకు ఇప్పటివరకూ పాక్ వద్ద ఈ క్షిపణులు బాగానే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మిస్సైల్స్ - అణ్వాయుధాల విషయంలో పాక్ - భారత్ ల శక్తిసామర్ధ్యాలను ఒకసారి పరిశీలిద్దాం...
పాక్ వద్ద ఉన్న ఒక బేసిక్ మిస్సైల్.. నసర్. దీని రేంజ్ 70 కిలోమీటర్లు. అంటే దీని సామర్ధ్యం ఇండియా బోర్డర్ ని టచ్ చేయడం వరకూ పాక్ కు ఉపయోగపడుతుంది. పాక్ చేతిలో ఉన్న రెండో మిసైల్ హతాఫ్. వీటి రేంజ్ 70 - 100 కి.మీ. ఇక మరో మిస్సైల్ గజ్ నవీ.. దీని రేంజ్ 290 కి.మీ. ఇదే సమయంలో పాక్ మాటల్లో కాస్తో కూస్తో దైర్యం ఉందంటే దానికి కారణం అబ్దాలీ మిసైల్. దీని రేంజ్ 180 - 200 కి.మీ. దీంతో పాక్ టార్గెట్ చేస్తే ఇండియాలోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ - ఢిల్లీ - హిమాచల్ ప్రదేశ్ లను టచ్ చేయగలదన్న మాట. ఇదే సమయంలో పాక్ చేతిలో ఉన్న మరో క్షిపణి గోరి. సుమారు 1500 కి.మీ వరకూ దూసుకెళ్లగలిగే రేంజ్ దీనిసొంతం. ఇదే సమయంలో పాక్ చెప్పుకోదగ్గ మరో క్షిపణి సాహిల్. ఈ క్షిపణితో ముంబై - కోల్ కతాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులను సైతం టార్గెట్ చేయాలని భావిస్తుంది పాకిస్థాన్. ఇదే సమయంలో పాక్ మరో ఆయుధం అంజా. దీంతో గగన తలంలో ఉన్న విమానాలను కూల్చగలమనేది పాక్ వ్యూహంగా కనిపిస్తుంది. ఇవన్నీ పాక్ మీడియా చూపిస్తున్న వివరాలు.. దైర్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ ముందు చేస్తున్న తాటాకు చప్పుళ్లు.
మరి వీరి తాటాకు చప్పుళ్ల సంగతి అలా ఉంచితే... అసలు భారత్ అంబులపొదిలో ఉన్న మిస్సైల్స్ ఏమిటి? వాటి సామర్ధ్యాలు ఎంత? పాక్ తో పోలిస్తే భారత్ మిస్సైల్ బలమెంత?... ఒక్కమాటలో చెప్పాలంటే భారత్ వద్ద ఉన్న మీడియం మిసైల్స్ ని పరిగణలోకి తీసుకున్నా... పాక్ తమవద్ద ఉన్నాయని చెబుతున్న మిసైల్స్ అసలు లెక్కల్లోకే రావు. ఇప్పటివరకూ డి.ఆర్.డి.ఓ. తయారుచేసి ప్రయోగించిన క్షిపణుల సంఖ్య - వాటి సక్సెస్ రేటుతో ప్రపంచంలోని బలమైన క్షిపణులున్న దేశాల్లో భారత్ ది నాలుగో స్థానం. యూకే - యూఎస్ - రష్యా - చైనాల సరసన భారత్ ఎప్పుడో చేరిపోయింది. వాటిలో సేంపుల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే... ముందుగా మాట్లాడుకోవాల్సింది ఫృధ్వీ గురించి. సరిహద్దుల్లో దీన్ని పెడితే లాహోర్ సంగతి చూసుకొవడానికి ఇదొక్కటి చాలు. అనంతరం మాట్లాడుకోవాల్సింది అగ్ని క్షిపణి గురించి. దీని రేంజ్ 1500 కి.మీ. ఈ ఒక్కటి చాలు పాక్ ను సగం నాశనం చేయడానికి.
ఇక అగ్ని - 1 రేంజ్ 700 కి.మీ. సరిగ్గా బోర్డర్ లో ఎక్కుపెడితే ఇస్లామాబాద్ సంగతి ఇది చూసుకుంటుంది. అగ్ని - 2 రేంజ్ 2000 కి.మీ. ఇండియా - పాక్ సరిహద్దుల్లో ఇది మొదలైతే పాక్ కు అవతలి వైపును టచ్ చేయగల సామర్ధ్యం దీని సొంతం. అగ్ని - 3... దీని రెంజ్ 3000 కి.మీ. అగ్ని - 4 రేంజ్ 4000 కి.మీ. ఇక అగ్ని - 5 రేంజ్ 5000 కి.మీ. ఇవి మచ్చుకు కొన్ని మత్రమే ఇంకా బ్రహ్మాస్ గురించి మాట్లాడుకుంటే పాక్ స్థాయిని పెంచేసినట్లు అవుతుంది. ఇప్పటివరకూ భారత్ వద్ద ఉన్న ఏ మిడిల్ రేంజ్ మిస్సైల్ ని ప్రయోగించినా పాక్ ను ఈ చివర నుండి ఆ చివరి వరకూ టచ్ చేయగలదు భారత్. భూమిపైనా - నీటిలోనూ - ఆకాశంలోనూ ఎక్కడైనా భారత్ శక్తిముందు పాక్ బలం పరిగణలోకి తీసుకోజాలనిదనే చెప్పాలి.
ప్రస్తుతానికి చెప్పుకున్న ఈ మచ్చుతునకలు చాలు భారత్ మిస్సైల్ బలం ముందు పాక్ ఎంతో చెప్పడానికి! ఈ విషయంలో భారత్ మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో పాక్ కు తెలియంది కాదు. అయినా కూడా అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటూ ఏదో మాట్లాడుతుంటుంది పాక్. చేతలతో కానిది మాటలతో చెప్పి మమా అనిపించేస్తుంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/