Begin typing your search above and press return to search.

భార‌త్‌ తో అణు యుద్ధం తప్పదేమో!

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:57 AM GMT
భార‌త్‌ తో అణు యుద్ధం తప్పదేమో!
X
దాయాదీ దేశ‌మైన పాకిస్థాన్ మరోసారి భార‌త్‌ ను కెలికింది. మ‌న‌దేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మ‌ళ్లీ చేసింది. ఏకంగా యుద్ధం వ్యాఖ్య‌లు చేసింది. అందులోనూ అణుయుద్ధం పేరుతో బెదిరింపుల‌కు దిగింది. చిత్రంగా బెదిరింపు గేమ్ ఆడింది. `దక్షిణాసియాలో సుస్థిరత చాలా సున్నితంగా ఉంది.ఏ సమయంలో అయినా అణు యుద్ధం తప్పకపోవచ్చు` అని ఆ దేశ భద్రతా సలహాదారు నజీర్ ఖాన్ జన్‌ జువా చెప్పడం గమనార్హం. దీనికి ఆయన ఇండియానే నిందిస్తున్నారు.

మ‌న‌దేశంలో ప్రమాదకర ఆయుధాలు పెరిగిపోతున్నాయట‌. అందువ‌ల్ల ఇది పాకిస్థాన్‌ కు ముప్పట‌. అందుకే యుద్ధం వ‌స్తుంద‌ట‌. ఇది పాక్ భ‌ద్ర‌త స‌ల‌హాదారు విశ్లేష‌ణ‌. అంతేకాదు ఈ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ను అడ్డుకోవడానికి ఇండియాతో కలిసి అమెరికా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జాతీయ భద్రతకు సంబంధించి నిర్వహించిన సెమినార్‌ లో మాట్లాడుతూ.. నజీర్ ఈ కామెంట్స్ చేశారు. ఈ ప్రాంతంలో అమెరికా బలగాలను మోహరించడం ఉగ్రవాదానికి ఊతమిచ్చిందని నజీర్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్‌ లు మళ్లీ చెలరేగుతుంటే.. అమెరికా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్‌ పైకి వాటిని నెడుతోంద‌ని పాక్ స‌ళ‌హాదారు ఆరోపించారు.

దక్షిణాసియాలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికే ఇండియాతో కలిసి సీపీఈసీకి వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేస్తున్నదని పాక్ స‌ల‌హాదారు ఆరోపించారు. ఆఫ్ఘనిస్థాన్ విషయంలోనూ పాకిస్థాన్‌ ను కాదని అమెరికా ఇండియాకు ప్రాధాన్యమివ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఏ విధంగా ఇలాంటి ప్రాధాన్యం ఇస్తుంద‌ని మండిప‌డ్డారు. ఇదిలాఉండ‌గా..గ్లోబల్ శక్తిగా భారత్ ఆవిర్భవిస్తున్న తీరును అమెరికా మెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్ర‌క‌టించిన‌ నూతన జాతీయ భద్రతా విధానంలో ఈ అంశాల‌ను వివ‌రించారు. భారత్‌ కు సహకారాన్ని అందించేందుకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. భద్రతా వ్యూహాం కింద ట్రంప్ ప్రభుత్వం భారత్‌ కు పూర్తి అండగా నిలవనుంది. చైనా - రష్యా స‌హా ఇస్లాం దేశాలను తమ శత్రువులుగా భావించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.