Begin typing your search above and press return to search.

భార‌త్‌-పాక్ అణ్వాయుధాల‌తో రెడీ

By:  Tupaki Desk   |   21 Jan 2016 3:39 PM GMT
భార‌త్‌-పాక్ అణ్వాయుధాల‌తో రెడీ
X
ఇప్పుడిప్పుడే మిత్రులు అవుతున్న ఇండియా-పాకిస్తాన్‌ లు లోలోప‌ల యుద్ధ భ‌యంలో ఉన్నాయా? పైకి దోస్తీ ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ లోలోప‌ల అణ్వాయుధాల‌తో రెడీ అయిపోతున్నాయా? ర‌హ‌స్యంగా జరుగుతున్న ఈ ఆప‌రేష‌న్ ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికాకు తెలిసిపోయిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

భార‌త్‌పై ఇంకా న‌మ్మ‌కం కుద‌రని పాకిస్తాన్ త‌న‌పై దాడి చేయ‌వ‌చ్చ‌నే భ‌యంతో అణ్వాయుధాల‌ను రెడీ చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో త‌న రాజ‌ధాని అయిన ఇస్లామాబాద్‌ ను అణ్వాయుధ నిరోధ‌క న‌గ‌రంగా తీర్చిదిద్దే ప‌నిలో బిజీబిజీగా ఉంద‌ట‌. త‌మ దేశానికి చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అనే సంస్థ ఈ వివరాలను తెలియజేసిందని అమెరికా వెల్ల‌డించింది. ఇంత‌కుముందే ఈ ర‌కంగా అణ్వాయుధాల‌ను రెడీ చేసుకున్న‌ప్ప‌టికీ ప‌ఠాన్‌ కోట్ దాడి నేప‌థ్యంలో మ‌రింత వేగం చేసిందని ఈ రిపోర్టు వివ‌రించింది.

మ‌రోవైపు భార‌త్ కూడా ఏ మాత్రం త‌క్కువ తిన‌లేద‌ట‌. 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలతో పాక్ దాడిని తిప్పికొట్టేందుకు ఇండియా సిద్ధంగా ఉంద‌ట‌. అయితే భార‌త్ ముందుగా దాడి చేసే అవ‌కాశం లేద‌ని ఈ రిపోర్టు వెల్ల‌డించింది. ఈ విధంగా రెండు దేశాలు అణ్వాయుధాలతో రంగానికి సిద్ధంగా ఉండ‌టం ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌రప‌రుస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టే విష‌యం ఏదైనా ఉందంటే అది అణ్వాయుధాలే అనే విష‌యం తెలిసిందే. అయితే ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన విస్పోట‌కాలు దాయ‌ది దేశాల మ‌ధ్య ఉండ‌టం ఈ ప‌రిణామాల‌కు దోహ‌దం చేస్తోంది.