Begin typing your search above and press return to search.
ఎత్తు పారలేదు.. దాయాది పరువు బజారుపాలు
By: Tupaki Desk | 18 Aug 2019 7:31 AM GMTదాయాదికి దిమ్మ తిరిగిపోయింది. ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటున్న దాయాది పాక్ కు అంతర్జాతీయ సమాజంలో పరువు పోయింది. కశ్మీర్ అంశంపై భారత్ ను ఇరుకున పెట్టేందుకు డ్రాగన్ తో జత కట్టి దుర్మార్గపు ప్లాన్ చేసినా వర్క్ వుట్ కాలేదు సరికదా.. అంతర్జాతీయంగా భంగపాటు తప్పలేదు. ఐక్య రాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 15 దేశాల రహస్య సమావేశం ప్రారంభానికి ముందు విలేకరులతో దర్జాగా మాట్లాడి.. భారత్ కు ఇబ్బందులు తప్పవన్న సంకేతాన్ని ఇస్తూ వెళ్లిన పాక్.. చైనా ప్రతినిధులు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియా కంటికి కనపడకుండా చల్లగా జారుకోవటం గమనార్హం.
ఆర్టికల్ 370 నిర్వీర్యం తదితర నిర్ణయాలతో కశ్మీర్ పై భారత్ వ్యవహరిస్తున్న తీరును పాక్.. చైనాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ అంశంపై సంయుక్త ప్రకటన చేయాలన్న చైనా ఒత్తిడిని ఐక్యరాజ్యసమితి నో చెప్పేసింది. ఈ సమావేశం ప్రారంభం కావటానికి ముందు చైనా.. పాక్ రాయబారులు మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక నిర్ణయం తీసుకుంటుందని.. చర్యల్ని సమావేశం తర్వాత ప్రకటిస్తారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
అయితే.. అందుకు భిన్నంగా భద్రతా మండలి రహస్య సమావేశం జరిగినట్లుగా తెలిసింది.కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవటానికి ఏమీ లేదని.. అది భారత్ అంతర్గత విషయంగా తేల్చేయటంతో పాటు.. అది భారత్.. పాక్ మధ్య ద్వైపాక్షిక అంశంగా యూఎన్ లోని అత్యధిక దేశాలు అభిప్రాయపడ్డాయి. పాక్.. చైనాలకు బ్రిటన్ వంత పాడినా.. మిగిలిన దేశాలు మాత్రం భారత్ కు అండగా నిలిచాయి. అంతేకాదు.. చైనా ఏదైనా ప్రకటన చేయాలంటే అది తమ దేశ ప్రకటనగా చేయాలని ఇతర దేశాలు స్పష్టం చేయటం డ్రాగన్ కు మింగుడుపడలేదు.
ఈ అంశంపై భారత్ వాదనను సమర్థించటమే కాదు.. ఈ అంశంపై తమ వైఖరిని వెల్లడించటానికి సైతం సభ్య దేశాలు ఆసక్తి ప్రదర్శించలేదు. అన్నింటికి మించి ఈ సమావేశ మినిట్స్ లోనూ కశ్మీర్అంశాన్ని రికార్డు చేయకపోవటం గమనార్హం. కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని.. దాన్నినైనా పట్టించుకోవాలని సమావేశంలో చైనా వాదించింది. భారత్ ను ఇరుకున పడేయాలని చూసింది. దీనిపై అమెరికా.. ఫ్రాన్స్.. రష్యా.. డొమినికన్ రిపబ్లిక్.. ఆఫ్రికా దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచాయి. దీంతో చైనాకు ముఖం కొట్టేసిన పరిస్థితి. భారత్.. పాక్ ల మధ్య ఉద్రిక్తతలు ఆసియాకు మంచిది కాదని ఇండోనేషియా సూచన చేసింది. వాస్తవానికి ఈ సమావేశం చైనా ఒత్తిడితోనే జరిగింది. సమావేశానికి ముందు హడావుడి చేసిన పాక్.. చైనా రాయబారులు.. మీటింగ్ తర్వాత మాత్రం ముఖం చాటేస్తూ.. కనిపించకుండా బయటకు వెళ్లిపోవటం గమనార్హం.