Begin typing your search above and press return to search.
మారని పాకిస్తాన్: వైద్యులపై లాఠీచార్జి.. అరెస్ట్
By: Tupaki Desk | 7 April 2020 4:30 PM GMTప్రస్తుతం మానవాళిని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఆ వైరస్ బారి నుంచి బయట పడేందుకు ప్రపంచ దేశాలు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలను రక్షిస్తున్న వారు మాత్రం వైద్యులు, వైద్య సిబ్బంది. విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలను నిలబెడుతున్న వైద్యులు, శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బందిని ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారు. ఈ సమయంలో వారు అద్భుతంగా పని చేస్తూ అభినందనలు పొందుతున్నారు. కానీ ఒక చోట మాత్రం వైద్యులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం వైద్యులను అరెస్ట్ చేయడంతో దుమారం రేగుతోంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వైద్యులపై దాడికి పాల్పడి అరెస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లోని క్వెట్టాలో చోటుచేసుకుంది.
పాకిస్తాన్‌లోని క్వెట్టాలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే విధులు నిర్వహించే వైద్యులు, వైద్య సిబ్బందికి పరికరాలు, సామగ్రి కొరత ఏర్పడింది. కరోనా పాజిటివ్, అనుమానితులకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల కొరత ఉంది. మాస్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, దుస్తులు అందుబాటులో లేవు. ఈ పీపీఈ కిట్లను అందించాలని కొన్ని వారాలుగా వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రి ఎదుట వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆందోళన చేయగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. మొత్తం 53 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని అరెస్ట్ చేశారు.
అయితే ఈ ఘటనపై బలూచిస్తాన్ ప్రభుత్వం స్పందించి వివరణ ఇచ్చింది. పీపీఈ కిట్ల కొరత ఉన్నది వాస్తవమేనని చెబుతూనే వైద్యుల తీరును ఖండించింది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నా వైద్యులు, వైద్య సిబ్బంది సహనం కోల్పోయి 144 సెక్షన్‌ను ఉల్లంఘించి నిరసన చేపట్టారని తెలిపింది. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఆ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లో వైద్యులను రక్షించుకోవాలి.. కానీ ఇలా చేయడం తగదని తప్పుబడుతున్నారు. పాకిస్తాన్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 3,469 నమోయ్యాయి. 50 మంతది చనిపోయారు.