Begin typing your search above and press return to search.
తాలిబన్ చేతుల్లో పాక్ పోలీస్టేషన్.. డెడ్ లైన్ విధింపు..!
By: Tupaki Desk | 19 Dec 2022 2:30 PM GMTఆయుధం పట్టినవాడు ఆయుధం చేతిలో పోతారన్నట్లుగా.. ఉగ్రవాదాన్ని ఎవరైతే పెంచి పోషిస్తారో వారికి కూడా అదే గతి పడుతుంది. ప్రపంచ దేశాలకు ఉగ్రవాదులను సరఫరా చేసే దేశం ఏదైనా ఉంటే అందరి చేయి పాకిస్థాన్ వైపు చూపెడుతోంది. ఉగ్రవాదులను తయారుచేసే కర్మాగారంగా పాకిస్థాన్ మారిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదని.. ఉగ్రవాదుల పోరాటంలో తాము ఎన్నో త్యాగాలు చేసినట్లుగా చెప్పుకుంటోంది. 75 ఏళ్లుగా ఒక్క ప్రభుత్వం కూడా అక్కడ పూర్తి కాలం పాలన కొనసాగించ లేదంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ను ఆ దేశ ఆర్మీని పరోక్షంగా నడుస్తుందని అందరికీ తెలిసిందే.
కాగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించిన తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆప్ఘనిస్తాన్లో ఇప్పుడు తాలిబన్లు ఆడిందే ఆట.. పాడిందే పాట.. ఎవరైతే తమ ఆంక్షలను ధిక్కరిస్తే పాలన పేరుతో బహిరంగంగా ఉరి తీసే చర్యలు చేపడుతున్నారు. మహిళలపై తీవ్రమైన ఆంక్షలు పెడుతున్నారు. దీంతో వాళ్లంతా కిమ్ అనకుండా ఇంట్లోనే ఉండి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆఫ్ఘన్ ను ఆక్రమించినట్టుగా తాలిబన్లు పాక్ పై సైతం కన్నేసినట్లు కన్పిస్తోంది. వాయువ్య పాకిస్థాన్లోని ఖైబర్ పక్తూన్ క్వాలోని ఓ కంటోన్మెంట్ లోని పోలీస్ స్టేషన్ ను తాజాగా తాలిబన్లు ఆక్రమించుకున్నారు. తెహ్రీక్ ఈ తాలిబాన్ సభ్యులు ఆ కంటోన్మెంట్ పరిధిలోని కొంత భాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఉగ్రవాద వ్యతిరేక పోరాట దళానికి చెందిన తొమ్మిది సభ్యులను బందీలుగా పట్టుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై ఆ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ షరీఫ్ మాట్లాడుతూ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని స్పష్టం చేశారు.
కాగా తాలిబన్లు 9 మంది పోలీసులను బందీలుగా పట్టుకున్నట్లు ఒక వీడియోను విడుదల చేశారు. కొంతమంది ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని.. ఆఫ్ఘానిస్తాన్ కు వాయు మార్గంలో వెళ్లడానికి హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని వజీరీస్థాన్ లోని లక్కీ మార్వాట్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నలుగురు పోలీసులను హత్య చేసిన కొద్దిసేపటికే పాక్ లోని ఖైబర్ పక్తూన్ క్వాలోని పోలీస్ స్టేషన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో పాక్ భద్రతా దళాలు 17 గంటలుగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
తాలిబన్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. అయితే తాలిబన్లు బయటి నుంచి దాడి చేయలేదని.. పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేస్తున్న సమయంలోనే ఆయుధాలను లాక్కోని పోలీస్ స్టేషన్ ను అదుపులోకి తీసుకున్నారని జిల్లా పోలీస్ అధికారులు చెబుతున్నారు. అనంతరం పోలీస్ భవనానికి కాపాలా ఉన్న గార్డులను సైతం చంపేశారని పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.