Begin typing your search above and press return to search.

కాళ్ళ కింద నీళ్ళు చేరాక ఇమ్రాన్ నోట నిజాలు... ?

By:  Tupaki Desk   |   21 March 2022 3:30 AM GMT
కాళ్ళ కింద నీళ్ళు చేరాక ఇమ్రాన్ నోట నిజాలు... ?
X
ఎవరికైనా ఇంతే అనుకోవాలి. అంతా బాగుంటే ఓకే ఓకేగా సీన్ ఉంటుంది. అసలు విషయాలు ఏవీ కళ్లకు కనబడవు. తాము తలచిందే నిజమని భ్రమల్లో ఉంటారు. పాకిస్థాన్ ఏలికలకు అది ఏమాత్రం కొత్త కూడా కాదు, అయితే అధికార మైకాలు దిగిపోతున్న వేళ తమ వారు అనుకున్న వారు పరవారు అని తేలిపోయాక మాత్రం పొరలు బాగానే వీడిపోతాయి. నిజాలు నోట్లో తన్నుకు వచ్చేస్తాయి.

ఇపుడు సరిగ్గా అదే పరిస్థితి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ది. ఈ మాజీ క్రికెట్ ఆటగాడి రాజకీయ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోతున్న సన్నివేశం కళ్ల ముందే ఉంది. తెర వెనక తోలుబొమ్మలాట ఆడించే పాక్ సైన్యం చెక్ చెప్పేస్తోంది. అది గ్రహించిన ఆయన పార్టీ ఎంపీలే తలాఖ్ అనేస్తున్నారు.

దాంతో బలం మొత్తం వీగిపోగా ఇమ్రాక్ పాక్ సైన్యం మీద ఆగ్రహం తో ఊగిపోతున్నారు. పాక్ సైన్యం పాలనలో వేలు పెడుతోందని, పెత్తనం చేస్తోంది అని మండుతున్నారు. పనిలో పనిగా భారత్ ని కూడా తెగ మెచ్చేసుకుంటున్నారు. భారత్ విదేశాంగ విధానం భేష్ అని కూడా కితాబులు ఇస్తున్నారు. అక్కడ సైన్యం చాలా మంచిది. తమ పౌరుల కోసం ఎంతకైనా తెగించే సైన్యం భారత్ సొంతం. అదే టైం లో రాజకీయాల్లో వారు జోక్యం చేసుకోరు అని పొగుడుతున్నారు.

కొద్ది రోజుల్లో మాజీ అవుతున్న ఇమ్రా ఖాన్ కి ఇపుడు అసలు వాస్తవాలు తెలుస్తున్నాయా అని భారత్ లోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సైన్యం వద్దు పొమ్మంటే అక్కడ ప్రధాని ఇంటికే. అలా మాజీ ప్రధాని గా ట్యాగ్ తో ఇమ్రన్ ఖాన్ త్వరలో గద్దె దిగబోతున్నారు. దాంతో ఆయనకు భారత్ మీద ప్రేమాభిమానాలు పొంగిపొరలుతున్నాయి.

ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని గా ఉన్న నాలుగేళ్ల కాలంలో నూ అంతకు ముందు కూడా భారత్ ఇలాగే గొప్పగానే ఉంది. కానీ ఆ సత్యం ఇమ్రాన్ కి తెలియడానికి ఇంతకాలం పట్టిందనే సెటైర్లు పడుతున్నాయి.