Begin typing your search above and press return to search.
ఆర్థిక వ్యవస్థ కుదేలు...తన ఇంటిని అద్దెకిస్తానంటున్న ప్రధాని !
By: Tupaki Desk | 4 Aug 2021 7:30 AM GMTప్పటివరకు ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ నిధుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఆర్ధిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ పక్కనున్న గల్ఫ్ దేశాలు ఆయిల్, పర్యాటక రంగం పేరుతో సంపాదన పెంచుకుంటుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదులకు అండగా ఉంటూ, చైనా కు వత్తాసు పలుకుతూ, భారత్ ని చూసి ఏడుస్తూ పరిస్థితిని దిగజార్చుకుంటోంది. ఇప్పటికే ఆ దేశం పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది.
ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే ఉన్నది. పాక్ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే చివరకు ఇస్లామాబాద్ లోని తన అధికారిక నివాసాన్ని అద్దెకు ఇస్తానని స్వయంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. విశాలమైన ఈ బంగళాను ఆయన ఖాళీ చేస్తారని పాలక తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ ప్రకటించింది. దీన్ని ఇక పీజీ ఇన్స్ టిట్యూట్ గా మార్చే యోచన ఉందని తెలిపింది. భారీగా పెరిగిపోయిన ఖర్చులను తగ్గించుకుని ఆ నిధులను సంక్షేమ పథకాలకు వినియోగిస్తారట. తన భవనాన్ని విద్యా సంస్థగా మార్చేందుకు ఇమ్రాన్ ఖాన్ కూడా సుముఖంగానే ఉన్నారు.
దీని నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని విద్యా శాఖ మంత్రి షఫ్ ఖత్ మెహమూద్ తెలిపారు. ఇంతేకాదు, గవర్నర్ల బంగళాలకు కూడా రోజులు దగ్గర పడ్డాయి. లాహోర్ లోని గవర్నర్ బంగళాను, కరాచీలోని బంగళాను మ్యూజియంలుగా , ముర్రే లోని దాన్ని మ్యూజియం,,ఆర్ట్ గ్యాలరీగా మార్చే యోచన కూడా ఉందని ఆ మంత్రి చెప్పారు. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక నివాసం ఉన్నది. విశాలమైన స్థలంలో ఉన్న అధునాతన భవనం అది. అయితే, ఇటీవలే ఆయన దాన్ని ఖాళీచేశారు. మొదట ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామని అనుకున్నా కుదరలేదు.
దీంతో ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వాలని ఇమ్రాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఈవెంట్లు, సెమినార్లకు ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారు. ఫలితంగా కోట్ల రూపాయలు సంపాదన వస్తుందని అది ప్రభుత్వ ఆలోచన. 2019 లోనే ప్రధాని అధికారిక నివాసాన్ని వెడ్డింగ్ వెన్యూగా మార్చేశారట. ఈయనకు మిలిటరీ సెక్రెటరీ అయిన బ్రిగేడియర్ వసీం ఇఫ్ధికార్ చీమా కుమార్తె పెళ్ళికి దీన్ని అద్దెకు ఇచ్చారట, బ్రహ్మాండంగా జరిగిన ఈ వెడ్డింగ్ కి ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరయ్యారు.