Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ రూట్లో పాకిస్థాన్‌ లోని పంజాబ్

By:  Tupaki Desk   |   21 May 2018 9:32 AM GMT
రాహుల్ గాంధీ రూట్లో పాకిస్థాన్‌ లోని పంజాబ్
X
కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ జెండా. ఆ కారణంతోనే మైనార్టీల ఓట్లు ఇంతకాలం ఆ పార్టీ జేబులో ఉండేవి. కానీ.. హిందూ ఓట్ల ఏకీకరణ చేయడంలో బీజేపీ సఫలం కావడంతో రాహుల్ గాంధీ కూడా మోదీని తట్టుకోవడానికి గుళ్లుగోపురాలు తిరుగుతూ హిందువులను ఆకర్షించే కార్యక్రమాలు చేశారు. అంతేకాదు.. తాను శివ భక్తుడినని.. జంథ్యం వేసుకుంటానని ఏవేవో చెప్పారు. గుజరాత్ - కర్ణాటక ఎన్నికల్లో ఆయన ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇది దేశ ప్రజలందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇప్పుడు పాకిస్థాన్‌ లో పంజాబ్ ప్రభుత్వం కూడా హిందువుల విషయంలో ఇలాంటి ఆశ్చర్యకర నిర్ణయమే తీసుకుంది.

పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అక్కడి హిందువులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పంజాబ్ ప్రావిన్స్ లోని రావల్పిండిలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వం సుమారు రెండు కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రావిన్స్ అసెంబ్లీలో ఉన్న హిందూ సభ్యుడి సిఫార్సు మేరకే ఈ నిధులను మంజూరు చేశారు. కానీ.. గతంలో ఎప్పుడూ ఇంత సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు చరిత్రలో లేదు. అంతేకాదు.. కొత్త ఆలయం పూర్తయ్యేంత వరకు విగ్రహాలను భద్రపరిచే బాధ్యతా ప్రభుత్వమే తీసకుంది. 1897లో కంజీమాల్ - రామ్ రచ్ పాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాకిస్థాన్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆలయంలో పూజలు జరుగుతుంటాయి. ప్రస్తుత గుడి కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలను కల్పించలేని పరిస్థితిలో లేదు. దీంతో దేవాలయ విస్తరణ పనులకు హిందూ సభ్యుడు ప్రతిపాదించగా ప్రభుత్వం ఊహించని రీతిలో పెద్ద మొత్తంలో నిధులిచ్చింది.