Begin typing your search above and press return to search.
పాక్ పాడు పని.. ఇరాన్ లో భారత వ్యతిరేక బ్యానర్లు
By: Tupaki Desk | 10 Sep 2019 5:28 AM GMTఅంతర్జాతీయ సమాజం నుంచి వరుస మొట్టికాయలు పడుతున్నప్పటికీ దాయాదికి బుద్ది రావటం లేదు. కశ్మీర్ మీద పిడివాదాన్ని వినిపిస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పాక్ చేసే పాడుపనులకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తాజాగా.. అలాంటి పనే మరొకటి చేసింది. దీంతో.. ఇరాన్ ఆగ్రహానికి గురైంది. అసలేం జరిగిందంటే..
ఇరాన్ లోని పాకిస్తాన్ దౌత్యకార్యాలయం వద్ద భారత్ కు వ్యతిరేకంగా బ్యానర్లను ఏర్పాటు చేసింది దాయాది. ఇరాన్ లోని మషాద్ పట్టణంలోని పాక్ దౌత్య కార్యాలయం వద్ద ఈ ఉదంతం చోటు చేసింది. కశ్మీరీలకు సంఘీభావంగా ఏర్పాటు చేసినట్లుగా చెప్పే బ్యానర్ల పై స్థానిక పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బలవంతంగా వాటిని తొలగించారు.
ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరాన్ని ఇరాన్ కు తెలియజేసింది. తమ భూభాగంలో పాక్ చేసిన పాడు పనిగా ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దౌత్య నిబంధనలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణించటమే కాదు.. పాక్ కు దిమ్మ తిరిగేలా ప్రశ్నల్సి సంధించింది.
ఇస్లామాబాద్ లోని తమ దౌత్య కార్యాలయం వద్ద సౌదీ ఆరేబియాకు వ్యతిరేకంగా బ్యానర్లు పెడితే మీరెలా స్పందిస్తారు? మీరు అందుకు అంగీకరిస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఇరాన్ నుంచి ఈ తరహా ప్రశ్నను ఊహించని పాక్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అయినప్పటికీ తన మొండితనాన్ని వీడకుండా.. తమ దౌత్య కార్యాలయ హక్కుల మేరకే తాము బ్యానర్లను పెట్టినట్లుగా కవర్ చేసింది.
దీనిపై ఇరాన్ రియాక్ట్ అవుతూ.. పాక్ మాకు సోదర దేశమని.. అలానే భారత్ తమకు శత్రువు కాదన్నారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరి ఏ మాత్రం మారదని స్పష్టం చేసింది. కశ్మీర్ అంశం భారత అంతర్గతమని ఇరాన్ తేల్చింది. మొత్తంగా వేరే దేశ భూభాగం మీద పాక్ చేపట్టిన చర్య పలువురి విమర్శలకు తావిచ్చింది.