Begin typing your search above and press return to search.

పాక్ రాడార్లకు చిక్కని భారత్ విమానాలు..

By:  Tupaki Desk   |   27 Feb 2019 8:56 AM GMT
పాక్ రాడార్లకు చిక్కని భారత్ విమానాలు..
X
పుల్వామా దాడి తర్వాత ప్రతీకారం ఉంటుందని భారత్ పాకిస్తాన్ కు చెప్పి మరీ దాడి చేసింది. అయినా పాకిస్తాన్ తమ దేశంలోకి భారత యుద్ధ విమానాల రాకను అడ్డుకోలేకపోయింది. భారత్ కు చెందిన మిరాజ్-2000 జెట్ యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించి దాడిచేసి తిరిగి వచ్చేదాకా ఏం చేయలేకపోయింది. దాడిచేస్తే తిప్పికొడుతామని తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించిన పాకిస్థాన్ ని భారత్ చెప్పి మరీ దెబ్బకొట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ నిఘా వైఫల్యంపైనే ఆ దేశం ఆందోళన చెందుతోంది.

ఏ దేశంలోకి అయినా తమ భూభాగంలోకి వేరే దేశానికి చెందిన విమానాలు వస్తే ఆటోమెటిక్ గా ఆ దేశ రాడార్ వ్యవస్థ స్పందిస్తుంది. ఆర్మీకి సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తుంది. శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు ప్రవేశిస్తే వెంటనే ధ్వంసం చేసే వ్యవస్థ ఉంటుంది. అయితే పాకిస్తాన్ ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నా భారత్ వాయుసేన ఆ దేశాన్ని బురిడీ కొట్టించి మరీ పని ముగించుకొని గమ్యానికి సేఫ్ గా చేరుకుంది.

ఇందుకు ప్రధాన కారణం పాక్ రాడార్ వ్యవస్థ బలహీనతే కారణంగా చెప్పొచ్చు. రాడార్లను సరిహద్దు మొత్తం వ్యాపించేలా ఉంచడం అనేది సాధ్యం కాదు. శత్రువు ఏవైపు నుంచి దాడి చేస్తారనేది ముందుగా ఊహించి అక్కడే రాడార్లను ఉంచుతుంటారు. ఈ బలహీనతే భారత్ అవకాశంగా మలుచుకుంది.. శత్రువు ఊహించని దారిలో వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి భారత విమానాలు వచ్చాయి. అంతేకాకుండా రాడర్లు ఎక్కువ ఎత్తులో ఉండే విమానాలను మాత్రమే గుర్తించగలవు. అలాగే భారత్ వద్ద అత్యంత శక్తివంతమైన సాంకేతిక ఉంది. భారత యుద్ధవిమానాలు పాక్ రాడార్ వ్యవస్థను జామ్ చేసి ఉండవచ్చనే వాదన విన్పిస్తోంది.

ఏది ఏమైనా వాపును చూసి బలుపు అనుకుంటున్న పాకిస్తాన్ కి భారత్ తగిన రీతిలో బుద్ది చెప్పడంపై దేశంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.