Begin typing your search above and press return to search.
షరీఫ్ సన్నాయి నొక్కులు..పాక్ హెచ్చరికలు!
By: Tupaki Desk | 15 Oct 2016 12:48 PM GMTఉరీ ఉగ్రదాడి - అనంతరం సర్జికల్ స్ట్రైక్ తో భారత్ దిమ్మతిరిగే దెబ్బ అనంతరం తాజాగా చర్చల విషయంలో స్పందించారు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్. నిన్నటివరకూ పాక్ కు చెందిన కొంతమంది నేతలు - మాజీ క్రికెటర్లు - అనధికారిక పాక్ సైన్యం కారు కూతలు - రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన తరుణంలో తాజాగా షరీఫ్ మాత్రం చర్చలు - చర్చలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ విషయంపై స్పందించిన షరీఫ్... భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని - కశ్మీర్ సమస్యలను పరిష్కారించాలని భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని చెబుతున్నారు.
ఇది నిజంగా పాకిస్థాన్ ప్రధానికి వచ్చిన ఆలోచనేనా లేక మరేదైనా కుక్కతోక వంకర బుద్దిలో భాగమా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే... నవాజ్ షరీఫ్ శాంతి - అశాంతి వంటి మాటలు తాజాగా మాట్లాడుతున్నారు. మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్ - బాకులో ఉన్న పాక్ ప్రధాని... భారత్-పాక్ మధ్య అశాంతియుత వాతావరణం నెలకొనడానికి కశ్మీర్ అంశమే ప్రధాన కారణమని, ఈ విషయంలో చర్చలు జరపడానికి తాము పలు పర్యాయాలు భారత్ ను ఆహ్వానించినా ప్రయోజనం లేకపోయిందని నిస్సిగ్గు వాదనకు తెరలేపారు.
ఇదే సమయంలో తాను భారత్ ను చర్చలకు పిలుస్తున్న సందర్భంలో కూడా అలవాటైన అసత్యాలను అనర్గలంగా మాట్లాడిన షరీఫ్... నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఎలాంటి చొరబాట్లకూ ప్రయత్నించలేదని - ఉడీలోని భారత ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనన్న భారత్ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచన మేరకు భారత్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు.
షరీఫ్ మాటలు ఇలా ఉండగా... మరోసారి పాక్ కు గట్టిగా హెచ్చరికలు పంపింది అగ్రరాజ్యం అమెరికా. తన భూభాగాన్ని స్వర్గధామంగా మార్చుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులందరినీ ఏరిపారేయాల్సిందేనని పాకిస్థాన్ కు మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నింటిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని ఆ దేశాన్ని కోరుతూనే ఉన్నాం అని అమెరికా విదేశాంగ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. అవసరమైతే ఈ విషయంలో పాకిస్థాన్ కు అమెరికా సాయం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంలో... ఎవరు ఎన్ని రకాల హెచ్చరికలు చేసినా - స్ట్రాంగ్ మెసేజ్ లు పంపినా తమ అనధికారిక సైన్యాన్ని పాక్ వదులుకుంటుందా.. తమ పిల్లలు కాదని తరిమేస్తుందా.. అగ్రరాజ్యం అమాయకత్వం కాకపోతేని అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/