Begin typing your search above and press return to search.

పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఓవ‌రాక్ష‌న్‌?

By:  Tupaki Desk   |   25 May 2017 4:34 AM GMT
పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఓవ‌రాక్ష‌న్‌?
X
భార‌త్ - పాక్ ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఒక్క‌సారిగా పెరిగిపోయాయా? యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయా? ప‌్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఒక్క‌సారిగా హాట్ హాట్ గా మారిపోయిందా? అంటే అవున‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌పంచంలో అతి ఎత్తైన సియాచిన్ గ్లేసియ‌ర్ ద‌గ్గ‌ర పాక్ యుద్ధ విమానాలు చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్లుగా పాక్ మీడియా పేర్కొంది. అయితే.. ఈ వార్త‌ల్ని భార‌త్ ఖండించింది.

మ‌రోవైపు.. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఎలాంటి ప‌రిణామానికైనా తాము సిద్ధంగా ఉన్న‌ట్లుగా పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చేసిన వ్యాఖ్య‌లు రెచ్చ‌గొట్టేవిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. సియాచిన్‌లో పాక్ యుద్ధ విమానాలు చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని.. భార‌త గ‌గ‌న‌త‌ల ప‌రిధిలో ఉల్లంఘ‌న‌లు చోటు చేసుకోలేద‌ని భార‌త వైమానిక ద‌ళం స్ప‌ష్టం చేసింది.

అంతేకాదు.. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. పాక్ చేష్ట‌ల‌కు ఈసారి గ‌ట్టిగా బుద్ధి చెప్పేందుకు వీలుగా.. స‌రిహ‌ద్దుల్లోని ఎయిర్ బేస్ ల‌ను భార‌త్ అలెర్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా నెల‌కొన్న‌ ఉద్రిక్త ప‌రిస్థితుల వేళ‌.. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు పాక్ ఎయిర్ ఫోర్సు చీఫ్ సొహైల్ అమ‌న్‌. పాక్ స‌రిహ‌ద్దుల్లోని భ‌ద్ర‌తను స‌మీక్షించే క్ర‌మంలో ఆయ‌న అమ‌న్ స‌రిహ‌ద్దుల్లోని స్క‌ర్దు స‌మీపాన ఉన్న ఖాద్రీ ఎయిర్ బేస్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా భార‌త్ ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు ఆయ‌న నోట రావ‌డం గ‌మ‌నార్హం. శ‌త్రువు త‌మ జోలికి వ‌స్తే త‌ర‌త‌రాలు గుర్తుంచుకునేలా బ‌దులిస్తామ‌న్న వ్యాఖ్య‌లు చేశారు.. నిత్యం దుర్మార్గాల‌కు పాల్ప‌డే పాక్‌.. త‌న తీరుతో స‌హ‌నానికి ప‌రీక్ష పెట్ట‌ట‌మే కాదు.. భార‌త్ ను త‌క్కువ చేసేలా మాట్లాడుతున్న వైనం కోట్లాది మంది భార‌తీయుల‌కు ఒళ్లు మండేలా చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/