Begin typing your search above and press return to search.
పాక్ బలుపు...భారత పాటకు డ్యాన్స్ చేసినందుకు అనుమతి రద్దు
By: Tupaki Desk | 17 Feb 2019 9:50 AM GMTపాకిస్థాన్ కవ్వింపు చర్యలు మానడం లేదు. ఏ అవకాశం దొరికినా, తన అక్కసును వ్యక్తం చేస్తోంది. తాజాగా రెండు కీలక ఘటనల్లో ఆ దేశం దుర్నీతి బయటపడింది. పాకిస్తాన్ లోని ఓ స్కూళ్లో భారతీయ పాటకు విద్యార్ధులు డాన్స్ చేశారు. దీంతో ఆ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అంతే కాదు ఆ స్కూలు యాజమాన్యంపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కరాచీలోని మామా బేబీ కేర్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఫంక్షన్ సందర్భంగా..విద్యార్థులు భారతీయ పాట పిర్ భీ దిల్ హై హిందూస్థానీ పాటకు డ్యాన్స్ చేశారు. స్టేజీ వెనక తెరపై ఇండియన్ ప్లాగ్ రెపరెపలాడింది. దీనిపై కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలాఉండగా, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. అమరులైన జవాన్లకు సంతాపం తెలిపింది. టెర్రరిస్టులను ఏరిపారేయడంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందంటూ పలు దేశాలు ప్రకటించాయి. పాకిస్థాన్ మాత్రం తన వక్ర బుద్ధిని బయటపెట్టుకుంది. దర్యాప్తు చేయకుండానే నిందలా అని ఉగ్రవాదులను వెనకేసుకుని వచ్చింది. భారత ఆక్రమిత కశ్మీర్ అంటూ పాక్ విదేశాంగ శాఖ ప్రకటనలు విడుదల చేసింది. ఆ దేశ ప్రభుత్వమే అలా ఉందనుకుంటే… మీడియా కూడా అదే బాటలో నడిచింది.
పుల్వామా దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ప్రకటనలు చేస్తే.. పాక్ మీడియా మాత్రం ఆ దాడికి పాల్పడిన ముష్కరులను యోధులంటూ కీర్తించింది. స్వాతంత్ర్య సమర యోధులంటూ నెత్తికెక్కించుకుంది. ‘ది నేషన్’ అనే పత్రిక ‘స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న వీరుల దాడి’ అని హెడ్డింగ్ తో కథనం రాసింది. ఓ వైపు ముష్కర మూకలను పొగుడుతూనే జైషే మహ్మద్ కు ఈ దాడితో సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే పుల్వామా దాడి తామే చేశామని, ఆ ఉగ్ర సంస్థ స్వయంగా ప్రకటించుకుంది. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఫొటో, వీడియోను కూడా విడుదల చేసింది. ‘ది నేషన్’ ఒక్కటే కాదు.. ఆ దేశానికి చెందిన ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్, డైలీ టైమ్స్ వంటి పలు మీడియా సంస్థలు ఇదే తరహా కథనాలను ప్రచురించాయి. కశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకుందంటూ పాక్ పత్రికలు విష ప్రచారాన్ని చేస్తున్నాయి.