Begin typing your search above and press return to search.
గిల్గిత్ పేరుతో మనల్ని గిల్లుతున్న పాక్
By: Tupaki Desk | 16 March 2017 6:25 AM GMTఇప్పటికే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్ వివాదం ఆరని చిచ్చుగా మారినప్పటికీ పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకుండా భారత్‌కు ఆందోళన కలిగించే నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని అయిదో రాష్ట్రంగా ప్రకటించాలని అనుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ కూడా గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతం తమ భూభాగమేనని వాదిస్తోంది. జమ్మూ కాశ్మీర్ మ్యాప్‌లో సైతం ఈ భారత్‌లో భాగంగానే కనిపిస్తుంది. అయితే కాశ్మీర్ వివాదం రెండు దేశాల మధ్య అతిపెద్ద వివాదంగా మారడంతో దీనిగురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
పాకిస్తాన్ ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతం దాదాపు 85, 793 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. పాకిస్తాన్ దీన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా పరిగణిస్తోంది. ఈ ప్రాంతానికి ప్రాంతీయ అసెంబ్లీ, ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. 1970లో ఈ ప్రాంతాన్ని మిర్‌పూర్- ముజఫరాబాద్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్), కేంద్ర పాలిత గిల్గిత్- బాల్టిస్తాన్‌గా రెండుగా విడగొట్టారు. 1963లో కుదిరిన సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ గిల్గిత్- బాల్టిస్తాన్ లోని షక్స్‌గామ్ వ్యాలీపై హక్కులను చైనాకు ఇచ్చింది. దాదాపు 4600 కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన చైనా- పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ఈ ప్రాంతం గుండా వెళ్తున్న కారణంగా ఈ ప్రాంతం చైనా - పాక్ లు రెండింటికీ అత్యంత ముఖ్యమైన ప్రాంతంగానే ఉంది. కాగా, గిల్గిత్- బాల్టిస్తాన్ కు రాష్ట్ర హోదా కల్పించాలని ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారయిన సర్తార్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినట్లు పాక్ మంత్రి రియాజ్ హుస్సేన్ పీర్జాదా జియో టీవీకి చెప్పారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో బలూచిస్తాన్ - ఖైబర్ ఫక్తూన్ క్వా - పంజాబ్ - సింధ్ రాష్ట్రాలున్న విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/