Begin typing your search above and press return to search.

భార‌త్‌కు వ్య‌తిరేకంగా.. పాకిస్థాన్ `సైబ‌ర్ ఆర్మీ` రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   28 Oct 2022 2:30 AM GMT
భార‌త్‌కు వ్య‌తిరేకంగా.. పాకిస్థాన్ `సైబ‌ర్ ఆర్మీ` రీజ‌నేంటి?
X
భార‌త్ దాయాది దేశం.. పాకిస్థాన్ త‌న కుటిల బుద్దిని మాత్రం పోగొట్టు కోవ‌డం లేదు. బార‌త్ ఎంత సంయ‌మ‌నం పాటిస్తున్నా.. పాకిస్థాన్ ఏదొ ఒక రూపంలో భార‌త్‌ను రెచ్చ‌గొడుతూనే ఉంది. అదేస‌మ‌యంలో భార‌త్‌పై దాడికి దొడ్డి దారులు.. దొంగ‌దారులు వెతుకుతూనే ఉంది. తాజాగా.. భార‌త్‌ను నిలువ‌రించేందుకు.. `సైబ‌ర్ ఆర్మీని` ఏర్పాటు చేస్తున్న తెలుస్తోంది.

దీనికి కార‌ణం.. దక్షిణాసియాలోని ప్రజలను భారత్‌కు వ్యతిరేకంగా ప్రభావితం చేయడం కోసమేన‌ని.. తెలుస్తోంది. ఈ సంచ‌ల‌న విష‌యాన్ని నార్డిక్ మానిట‌ర్ అనే ప‌త్రిక పేర్కొంది. ఇక‌, ఈ క్ర‌మంలో ట‌ర్కీ దేశాన్ని పాక్ సాయం కోర‌గా.. అవి సాయం చేసిన‌ట్టు ప‌త్రిక వివరించింది.

భారత్‌కు వ్యతిరేకంగా సైబర్‌ ఆర్మీని తయారు చేసేందుకు పాకిస్థాన్‌కు టర్కీ రహస్యంగా సాయం చేసిన విషయాన్ని నార్డిక్‌ మానిటర్‌ అనే ఐరోపా పత్రిక పేర్కొంది. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటానికి అవసరమైన ఒప్పందం ముసుగులో ఈ సాయం అందించినట్లు వెల్లడించింది. దక్షిణాసియాలోని మైనార్టీల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభావితం చేసి భారత్, అమెరికాపై ప్రతికూల ప్రభావం చూపేలా చేయడం, పాకిస్థాన్‌ పాలకులపై వచ్చే విమర్శలను అణచివేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

2018లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలోనే ట‌ర్కీ అంత‌ర్గ‌త భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల‌ మంత్రి సులేమాన్‌ పాక్‌లో పర్యటించినప్పుడు ఈ ప్లాన్‌కు ఆమోదముద్ర పడిందని ప‌త్రిక వివ‌రించింది. దీనికి సైబర్‌ క్రైమ్‌కు వ్యతిరేకంగా ఇరుదేశాల మధ్య సహకారానికి చేసుకొన్న ఒడంబడికకు ద్వైపాక్షిక ఒప్పందం ముసుగు వేసినట్లు నార్డిక్‌ మానిటర్‌ పేర్కొంది.

టర్కీ ఇంటీరియర్‌ మంత్రి సులేమాన్‌ ఈ నెల 13వ తేదీన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తొలిసారి అంగీకరించాడని కూడా.. ప‌త్రిక పేర్కొంది. ట‌ర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ తరపున ట్రోల్‌, బాట్‌ ఆర్మీలను సులేమాన్‌ నిర్వహిస్తాడని పేరుంది. ఎర్డొగాన్‌ పార్టీ ఏకేపీ చేతిలో శక్తివంతమైన సోషల్‌మీడియా ఆర్మీ ఉంది.

ఈ బృందంలో సుమారు 6,000 మంది ఉంటారని సమాచారం. ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని వాడుకొని ప్రజల దృష్టిలో ప్రతిపక్షాలు, విమర్శకులు, అధికార పార్టీలోని అసమ్మతి వాదులను బలహీన పర్చడం వంటి కార్యక్రమాలు చేస్తాయి. మ‌రిదీనిపై భార‌త్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.