Begin typing your search above and press return to search.
భారత్ చేతికి చిక్కిన మూడో కసబ్..
By: Tupaki Desk | 27 Aug 2015 4:05 PM GMTజమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని రఫీయాబాద్ వద్ద నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో భద్రతాదళాలు వారు ఉన్న ఇంటిని చుట్టుముట్టి లొంగిపోవాల్సిందిగా కోరాయి. అయితే వారు కాల్పులు జరపడంతో సైన్యం కూడా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించగా ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకోవడం ఇది రెండోసారి.
ఇటీవలే ఉధంపూర్ లో ఉస్మాన్ అలియాస్ నవేద్ ను స్థానికుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడంతో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మరో కీలక ఆధారం దొరికినట్లైంది. పట్టుబడిన ఉగ్రవాది పేరు సజ్జద్ అహ్మద్ అని తెలిసింది. లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదైన సజ్జద్....ముజఫర్ గఢ్ ప్రాంతానికి చెందిన వాడు. వరుస బెట్టి ఉగ్రవాదులను భారత్ పైకి దండయాత్రకు పంపిస్తోన్న పాకిస్థాన్ దుష్ట చర్యలను ప్రపంచం ముందుంచడానికి మరో సజీవ సాక్ష్యం లభించినట్లైంది.
ఇంత జరుగుతున్నా తమకేం తెలియదని నంగనాచి మాటలు చెప్తున్న పాక్ తీరును అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. మరోవైపు తగిన విధంగా బుద్ధి చెప్పాలని భారతీయులు కోరుకుంటున్నారు.