Begin typing your search above and press return to search.

గింజుకుంటున్న పాక్‌ పై భార‌త్ భారీ విజ‌యం

By:  Tupaki Desk   |   31 Oct 2019 1:51 PM GMT
గింజుకుంటున్న పాక్‌ పై భార‌త్ భారీ విజ‌యం
X
ఆర్టిక‌ల్ 370 విష‌యంలో...భార‌త్ తీరును త‌ప్పుప‌డుతూ..గ‌గ్గోలు పెట్టిన‌ప్ప‌టికీ...అంత‌ర్జాతీయ స‌మాజంలో ఒంటరైన పాకిస్తాన్‌ కు మ‌రోమారు అదే రీతిలో షాక్ త‌గిలింది. భారత నావికాదళం మాజీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌ పాకిస్థాన్‌ పై విజయం సాధించింది. గూఢచర్యం ఆరోపణలపై కుల్‌ భూషణ్‌ ను 2016 మార్చి 3న అరెస్ట్ చేసిన పాక్‌.. 2017లో ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై జ‌రుగుతున్న విచార‌ణల్లో అంతర్జాతీయ న్యాయస్థానం సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు అబ్దుల్‌ ఖావీ యూసఫ్ స్ప‌ష్టం చేశారు.

త‌మ దేశంలో గూఢచర్యం చేస్తున్నందున జాదవ్‌ ను బలూచిస్థాన్‌ లో పట్టుకున్నట్లు చెబుతున్న పాకిస్తాన్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించినట్లు పేర్కొంటూ....జాద‌వ్‌ పై కేసు పెట్టింది. దీన్ని విచారించిన పాక్‌ సైనిక కోర్టు జాదవ్‌ కు మరణశిక్ష విధించింది. అయితే జాద‌వ్ విష‌యంలో పాక్ చ‌ర్య‌ను భార‌త‌దేశం త‌ప్పుప‌ట్టింది. అయిన‌ప్ప‌టికీ జాద‌వ్ విష‌యంలో పాకిస్తాన్ విన‌క‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం తదుపరి విచారణ జరిపేంత వరకు పాక్‌ జాదవ్‌ కు మరణశిక్ష వాయిదా వేయాలంటూ స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు అబ్దుల్‌ ఖావీ ఈ కేసు వివ‌రాల‌ను అందిస్తూ...పాక్‌ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని స్పష్టం చేశారు.

జాదవ్‌ కేసులో పాకిస్తాన్‌ వ్యవహరించిన తీరును ఎండగట్టడ‌మే కాకుండా..... వియత్నం ఒప్పందంలోని ఆర్టికల్ 36ను పాకిస్థాన్ ఉల్లంఘించిన విషయాన్ని చెప్పారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ పాకిస్తాన్‌ ను ఐసీజే త‌ర‌ఫున ఆదేశించారు. దీంతో, వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా మ‌రోమారు పాక్ ప‌రువు పోగొట్టుకుంది. ఇటీవ‌లే నిజాం న‌గ‌ల విష‌యంలోనూ..భార‌త్ పై చేయి సాధించిన సంగ‌తి తెలిసిందే.