Begin typing your search above and press return to search.
అనుపమ్ ఖేర్ కు 'నో ఎంట్రీ' బోర్డు చూపిన పాక్
By: Tupaki Desk | 2 Feb 2016 9:20 AM GMTఇటీవలే పద్మభూషన్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. కరాచీలో జరిగే సాహితీ సమ్మేళనానికి వెళ్లేందుకు అవసరమైన వీసాను ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది.. భద్రతా కారణాలతోనే వీసా ఇవ్వలేకపోతున్నట్లు ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం ఆయనకు సమాచారం అందించింది.
కరాచీలో శుక్రవారం జరగాల్సిన సాహిత్య సమ్మేళనంలో అనుపమ్ ఖేర్ పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి 18 మంది విదేశీ ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో అనుపమ్ ఖేర్ కు మినహా మిగిలిన ప్రముఖులకు పాక్ వీసాలు మంజూరు చేసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే పాక్ ఈ పనిచేసిందని భావిస్తున్నారు. ఆహూతుల్లో 17 మందికి వీసాలు ఇచ్చి ఒక్కరికే ఇవ్వకపోవడం వెనుక వారిలో అసహనం బయటపడుతోందని తెలుస్తోంది. కాగా తనకు పాక్ వీసా నిరాకరించడం బాధ కలిగించిందని అనుపమ్ అంటున్నారు.
అయితే... పాకిస్థాన్ ఎందుకిలా చేసిందన్నదానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. నెల కిందట న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన పాకిస్థాన్ గాయకుడు రఫత్ అలీ ఖాన్ ను నిబంధనల పేరుతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిప్పి పంపారు. దీంతో ఆయన మళ్లీ అబుదాబి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చి ప్రోగ్రాం ఇచ్చారు. నిబంధనల ప్రకారం పాకిస్థాన్ జాతీయులు నేరుగా శంషాబాద్ రావడానికి అవకాశం లేనందున అక్కడి అధికారులు అలా వ్యవహరించారు. పాకిస్థాన్ జాతీయులు ఎవరైనా ఇండియా రావాలంటే ఢిల్లీ - ముంబయి - చెన్నై - కోల్ కత్తా విమానాశ్రయాల్లో దేనికో ఒకదానికి వచ్చి అక్కడి నుంచి మాత్రమే తాము వెళ్లాల్సిన చోటికి వెళ్లాలి. కానీ, రఫత్ అబుదాబి నుంచి నేరుగా హైదరాబాద్ రావడంతో ఆయన్ను మళ్లీ వెనక్కు పంపి ఢిల్లీ మీదుగా రావాలని సూచించారు. కానీ, ఆ ఘటనను పాక్ సీరియస్ గా తీసుకుని అందుకు ప్రతీకారంగా ఇప్పుడు అనుపమ్ ఖేర్ కు వీసా నిరాకరించి అవమానించిందని భావిస్తున్నారు.