Begin typing your search above and press return to search.
మైండ్ గేమ్.. ఇదే పాక్ వార్ ప్లాన్!
By: Tupaki Desk | 28 Feb 2019 5:24 AM GMTయుద్ధం మొదలు కాలేదు. ఆ మాటకు వస్తే.. యుద్ధ సన్నాహాకాలు కూడా పెద్దగా చోటు చేసుకోలేదు. కానీ.. అప్పుడే అణుయుద్ధం వరకూ మాటలు వెళ్లిపోయాయి. బెదిరింపులు మొదలయ్యాయి. తమకు సానుకూలంగా పరిస్థితి వచ్చిన వెంటనే చర్చలకు సందేశాన్ని పంపటం.. తామెంత పెద్ద మనుషులమన్నట్లుగా బిల్డప్ ఇవ్వటం వెనుక లెక్కలు వేరున్నాయి. బుధవారం పాక్ తీరు ఆసక్తికరంగానే కాదు.. అత్యంత వ్యూహాత్మకంగా ఉందని చెప్పక తప్పదు.
తమ పరిధిలో ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేసిన భారత్ పట్ల కారాలు మిరియాలు నూరుతున్న పాకిస్థాన్.. భారత్ తో యుద్ధం చేసేంత సత్తా తమకు లేదన్న బలహీనతను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగంగా మైండ్ గేమ్ ను స్టార్ట్ చేసింది.
ఇందుకు తగ్గట్లే బుధవారం పరిణామాలు చోటు చేసుకున్నట్లు చెప్పాలి. తాజాగా పాక్ వ్యూహం మొత్తం యుద్ధానికంటే మైండ్ గేమ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పాలి. ఎందుకంటే.. పాక్ కు యుద్ధం చేసేంత ఆర్థిక స్థితి కానీ.. శక్తియుక్తులు లేవు. అలాంటి వేళలో అందుకు భిన్నంగా మైండ్ గేమ్ చేసి.. భారత్ మీద పైచేయి సాధించినట్లుగా ప్రపంచానికి చూపించాలన్నదే ప్రయత్నంగా చెప్పాలి.
పాక్ మైండ్ గేమ్ ను కొందరి విశ్లేషణలో చెప్పాల్సి వస్తే.. మొదటి రెండు.. మూడు రోజులు భారత్ పై తీవ్ర దాడులు చేయాలి భారత్ ను చావుదెబ్బ తీసినట్లుగా బిల్డప్ ఇవ్వాలి. అందుకు తగ్గట్లు ప్రచారం చేయాలి. పాక్ తో యుద్ధానికి ఎందుకు దిగామా అని భారతపౌరులు ఫీలయ్యేలా చేయాలి. అణుయుద్ధానికి సిద్ధమంటూ భయపెట్టాలి. అంతర్జాతీయంగా ఉలికిపాటుకు గురయ్యేలా చేసి.. మధ్యవర్తిత్వం చేసేందుకు అందరూ సిద్ధమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే.. యుద్ధం చేయలేకపోయారన్న చెడ్డపేరు ఉండదు. అన్నింటికి మించి భారత్ మీద పైచేయి సాధించినట్లుగా చేసి.. ఇక భారత్ ఎప్పుడూ తమపై యుద్ధం చేసేందుకు సంకోచించేలా చేయటంగా చెబుతున్నారు.
పాక్ మాటలు చూసినప్పుడు బలంగా అనిపించినా.. దాని వెనుక ఉన్నది మాత్రం బలహీనతే. ఆర్థికంగా ఉన్న భారత్ తో పోల్చినప్పుడు పాక్ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పకతప్పదు. తాజాగా ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. దేశాధ్యక్షుడు.. ప్రధాని స్థాయి వారి విమాన ప్రయాణ ఖర్చుల్లోనూ కోత విధించిన పరిస్థితి. పొదుపు చర్యలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే.. అత్యున్నత స్థాయి వారు సైతం ఆచితూచి ఖర్చు పెట్టే పరిస్థితి.
ప్రభుత్వ వాహనాల్ని అమ్మి నిధులు సమకూర్చుకోవటం.. ప్రపంచ బ్యాంక్ ముందు అప్పు కోసం కిందా మీదా తిరుగుతున్న పరిస్థితి. గడిచిన పది.. పదిహేనేళ్లలో పాక్ ఆర్థికంగా నానాటికి బలహీన పడింది. దాన్ని కప్పి పుచ్చుకోవటానికి ఇప్పుడు మాటల మైండ్ గేమ్ మొదలెట్టింది. భారత సైనిక బడ్జెట్ లో ఐదో శాతం కూడా పాక్ సైనిక బడ్జెట్ ఉండదు. మరి.. అంత బలహీనమైన దేశం.. ఈ రోజు అణుయుద్ధంచేస్తామన్నట్లుగా బెదిరింపులకు దిగటం వెనుక అసలు కారణం.. యుద్ధాన్ని నివారించటం.. భారత్ అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవటంగా చెప్పక తప్పదు.
భారత్ తో దీర్ఘకాలం యుద్ధం చేయలేని పరిస్థితుల్లో .. యుద్ధాన్ని త్వరగా ముగించేలా చేయటం.. అందుకు తగ్గ వాతావరణాన్ని సృష్టించి తమదే పైచేయి అన్న భావన కలిగేలా చేయాలి. అందుకు తగ్గట్లుగా పాక్ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లుంది. యుద్ధం మొదలైన మరుక్షణం భారత్ ను గట్టిగా దెబ్బ తీయటం.. బయటకు చూసే వారికి భారత్ కంటే పాక్ పైచేయి అన్న భావన కలిగేలా చేయటమే పాక్ లక్ష్యం. అందుకే యుద్ధం మొదలు కాకముందే.. ఉద్రిక్తల వేళలోనే అణు ప్రస్తావన తీసుకొచ్చి భయోత్పాతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోంది.
భారత పౌరుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బ తినేలా చేయటం.. పాక్ పౌరుల్ని.. ఉగ్రవాద మూకలకు సంతృప్తి పరిచే రీతిలో ఉండాలన్నది పాక్ వ్యూహంగా చెబుతున్నారు. యుద్ధానికి ఎందుకు దిగామా? అన్న భావన భారతీయుల్లో కలిగించటమే పాక్ ముందున్న వ్యూహం. బుధవారం నాటి పరిణామాలు కొన్ని అందుకు నిదర్శనంగా చెప్పాలి. ఢిల్లీ మీద పాక్ జెండా ఎగురుతుందని పాక్ కు చెందిన ప్రముఖుడు వ్యాఖ్యానిస్తే.. యుద్ధమే వస్తే నేను కాని మోడీ కాని చేసేదేమి ఉండదని.. తన చేతుల్లో ఏమీ ఉండదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం కూడా భారత్ ను తమ మాటల మైండ్ గేమ్ తో కన్ ఫ్యూజ్ చేయటంగా చెప్పక తప్పదు.
చర్చల పేరుతో శాంతిమంత్రాన్ని జపించినట్లుగా చేయటం.. అదే సమయంలో భారత్ నో అనే పరిస్థితులు కల్పించటం పాక్ వ్యూహం. బయట నుంచి చూసినోళ్లకు పాక్ గిచ్చిన సంగతి కనిపించదు కానీ.. అమాయకంగా ముఖం పెట్టి.. శాంతి కోసం చర్చలు జరుపుతామంటే భారత్ మొండిగా వ్యవహరిస్తోంది. పెద్దన్న తరహాలో అధికారాన్ని చెలాయిస్తుందన్న కలర్ అంతర్జాతీయ సమాజంలో కనిపించేలా చేయటం మరో ఎత్తుగడగా చెప్పాలి. ఇందుకోసం పాక్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. యుద్ధం మానుకోవాల్సిందిగా అమెరికా.. చైనా.. బ్రిటన్ చేత భారత్ పై ఒత్తిడి తెచ్చేలా చేసి యుద్దాన్ని తమకు అనుకూలంగా ముగించాలన్న ప్లాన్ పాక్ చేస్తోంది.
పాక్ కుతంత్రాన్ని భారత్ ఎలా దెబ్బ తీయాలి? అన్నది ఇప్పుడున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే.. యుద్ధం తమకేమీ ఇష్టం లేదని..కానీ పాక్ కుయుక్తులతో తమను ఎలా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి చెబుతూనే.. పాక్ ఉచ్చులో ఇరుక్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పాక్ తో దీర్ఘకాలికంగా సాగే యుద్ధాన్ని చేయాలి. ఇప్పటి మాదిరే పాక్ మీద కాకుండా పాక్ లోని ఉగ్రమూలాల్ని ఏరివేసే భారీ ప్లాన్ ను పక్కాగా చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా ఎదురుదెబ్బలు తగిలినా.. అలాంటి చిన్న వాటిని చూసి ఎక్కువగా ఫీల్ కావటమన్నది అస్సలు ఉండకూడదు. అది అన్నింటికంటే ముఖ్యం. అందులోకి పాక్ కుతంత్ర దేశమన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.