Begin typing your search above and press return to search.
కశ్మీర్ కోసం ఎంతకైనా తెగిస్తాం.. పాక్ ఆర్మీ
By: Tupaki Desk | 6 Sep 2019 10:28 AM GMTజమ్మూ-కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఇండియాపై మరోసారి ఏడ్చింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఇండియాపై పాకిస్థాన్ అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సహ మిగతా నేతలు ఇండియాకి వార్నింగులు మీద వార్నింగులు ఇచ్చేస్తున్నారు. అవసరమైతే అణుయుద్ధానికి కూడా సిద్ధమని పెద్ద పెద్ద ప్రకటనలు చేసేస్తున్నారు. ఇక వీరికి మనోళ్ళు కూడా గట్టి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ భజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ హిందూత్వ బాధిత ప్రాంతమని, వేధింపులు అక్కడ నిత్యం కృత్యం అయ్యాయని అన్నారు. ఇక కశ్మీరే పాకిస్తాన్ ఎజెండా అని - భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుగా తీసుకుంటున్నామని - కశ్మీరీలను పాకిస్తాన్ ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టదని చెప్పారు. ఆఖరి సైనికుడి వరకు - చివరి బుల్లెట్ వరకు - తుది శ్వాస వరకు తాము పోరాడతామని - ఎంత వరకైనా వెళ్లేందుకు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటన చేశారు.
అయితే యుద్ధ మేఘాలు - ఉద్రిక్తతలు కమ్ముకుంటున్నప్పటికీ తాము శాంతినే కాంక్షిస్తున్నామని - కశ్మీరీలకు తాము ఉన్నామని - వారి కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధమంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. మొత్తానికి పాక్ ఆర్మీ చీఫ్ కశ్మీర్ కోసం భారత్ తో యుద్ధానికైనా సిద్ధమంటున్నారు. మరి ఈ పాక్ ఆర్మీ చీఫ్ కు మనోళ్ళు ఏం కౌంటర్ ఇస్తారో చూడాలి. కొద్ది రోజులుగా భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సరిహద్దల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతోన్న పాక్ మరోసారి అదే పంథాలో ముందుకు వెళుతున్నట్టు మరోసారి స్పష్టమైంది.