Begin typing your search above and press return to search.

అమూల్య మా కూతురే కాదు..దాన్ని జైల్లో పెట్టి కాళ్ళు విరగ్గొట్టినా తప్పులేదు!

By:  Tupaki Desk   |   21 Feb 2020 5:30 PM GMT
అమూల్య మా కూతురే కాదు..దాన్ని  జైల్లో పెట్టి కాళ్ళు విరగ్గొట్టినా తప్పులేదు!
X
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) పై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ..ఈ చట్టానికి వ్యతిరేకంగా జనాన్ని ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరు సిటీలోని ఫ్రీడంపార్క్‌ లో ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆమెపై ఉప్పారపేట పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదు చేసి ,కోర్టు లో హాజరు పర్చగా , కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి, 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించారు.

అయితే, అమూల్య వ్యవహారం గంటగంటకి ముదురుతోంది. ఈ క్రమంలోనే చిక్కమగళూరు జిల్లాలోని అమూల్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అమూల్యపై, సభ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, హిందూత్వ సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే , ఈ నేపథ్యం లోనే అమూల్య తండ్రి ,తన కూతురిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. సిఏఏ కి వ్యతిరేకంగా జరిగిన ఆ సభలో తన కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని , ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని తాను ఆమెకు చాలా సార్లు చెప్పానని, అయినప్పటికీ తన కూతురి లో ఎలాంటి మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆమెను జైల్లోంచి తీసుకురావడానికి తానే న్యాయ వాదులను సంప్రదించబోనని స్పష్టం చేశారు. చాలా కాలంగా తాము కూడా బీజేపీ మద్దతు దారులుగా కొనసాగుతున్నామని, ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ శోభా కరంద్లాజే, శ్రీనగరి బీజేపీ ఇన్ చార్జి జీవన్ రాజ్ తోనూ మంచి సంబంధాలున్నాయని

సీఏఏ వ్యతిరేక సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోన్ కు తీవ్రవాదులతో సంబంధాలున్నట్లు తెలిసిందని కర్నాటక సీఎం యడ్యూరప్ప సంచలన ప్రకటన చేశారు. కుటుంబ కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నదంటే బయటి వ్యక్తుల మాటలకు అమూల్య ఎంతగా ప్రభావితమైందో అర్థం చేసుకోవచ్చని, ఆమె వెనుక ఉన్నవారందరిని కూడా చట్టం ముందు నిలబెడతాం అని తెలిపారు. దీనిపై ప్రస్తుతం బెంగుళూరు అట్టుడికి పోతోంది.