Begin typing your search above and press return to search.

భార‌త్ ను అవ‌మానించేలా వీణామాలిక్ ట్వీట్!

By:  Tupaki Desk   |   5 Jun 2019 4:52 AM GMT
భార‌త్ ను అవ‌మానించేలా వీణామాలిక్ ట్వీట్!
X
సాయం చేసిన వారిని మ‌ర్చిపోలేం. బ‌తుకునిచ్చిన వారికి విధేయులుగా ఉండకున్నా.. క‌నీసం వారి మ‌న‌సులు గాయ‌ప‌రిచే చెత్త ప‌ని మాత్రం చేయ‌కూడ‌దు. ఆనీ.. అలాంటివేమీ త‌న‌కు ఉండ‌వ‌ని.. తిన్నింటి వాసాలు లెక్కించే విష‌యంలో త‌న‌కు మించిన ఘ‌నాపాఠి మ‌రొక‌రున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే పాక్ న‌టి వీణా మాలిక్ తాజాగా తన‌దైన దిక్కుమాలిన‌త‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రో దుర్మార్గ‌మైన ట్వీట్ చేశారు.

ప్ర‌ముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన‌టం ద్వారా బాగా పాపుల‌ర్ అయిన ఆమె.. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం.. ట్వీట్ల‌తో భార‌త్ మీద అక్క‌సును ప్ర‌ద‌ర్శిస్తుంటారు. భార‌త వాయుసేన పైల‌ట్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ పాక్ ద‌ళాల‌కు ప‌ట్టుబ‌డిన సంద‌ర్భంలోనూ వీణ పోస్ట్ చేసిన ట్వీట్ పెను దుమారాన్ని రేపింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం కూలిపోయి.. 13 మంది గ‌ల్లంతు కావ‌టం తెలిసిందే. అదృశ్య‌మైన విమానాన్ని గుర్తించేందుకు ఇస్రో శాటిలైట్లు.. నావ‌ల్ పీ-8ఐ గూఢ‌చ‌ర్య విమానాలు రంగంలోకి దిగాయి. అసోంలోని జోర్హాట్ లో సోమవారం సాయంత్రం టేకాఫ్ అయిన విమానం గ‌ల్లంతైన నేప‌థ్యంలో.. ఆ మ‌ధ్య‌న ఎన్నిక‌ల సమ‌యంలో ప్ర‌ధాని మోడీ చేసిన రాడార్ కామెంట్ ను ప్ర‌స్తావిస్తూ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం వాస్త‌వంగా కూలిపోలేద‌ని.. వాతావ‌ర‌ణం మేఘావృతం కావ‌టంతో దాన‌ని గుర్తించ‌లేక‌పోతున్నార‌ని ట్వీట్ చేశారు. దీనికి స్మైలీ ఇమేజ్ తో చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఒక విషాదం ఉదంతాన్ని ఎట‌కారం చేసుకోవ‌టం ఒకెత్తు అయితే..స్మైలీ ఇమేజ్ తో ట్వీట్ చేసిన తీరుకు ప‌లువురు మండిప‌డుతున్నారు.