Begin typing your search above and press return to search.
ఈ పాక్ అమ్మాయి హనీమూన్ వైరల్ అయింది
By: Tupaki Desk | 15 July 2017 11:41 AM GMTకొత్త జంట హనీమూన్ అంటే ఎలా జరుపుకొంటారు? ఎంచక్కా భార్య, భర్త కలిసిపోయి.....అబ్బో ఆ సంబరం అనుభవిస్తే కానీ తెలియదు. కానీ భర్తతోనే హనీమూన్ జరుపుకోవాలని ఏం లేదుగా?! కొత్తగా కూడా హనీమూన్ ను జరుపుకోవచ్చుగా? ఇదేం చిత్రమైన డౌట్ అనుకుంటున్నారా... అలా జరిగిన ఓ ఆసక్తికరమైన హనీమూన్ గురించి తెలుసుకుంటే మీరు తప్పక ఆశ్చర్యపోతారు.
పొరుగు దేశమైన పాకిస్థాన్ కు చెందిన హుమా మోబీన్ తన భర్త అర్సలామ్ సెవర్ భట్‌తో కలిసి తమ రెండో హనీమూన్ ను గ్రీస్ లో అట్టహాసంగా చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందుకోసం టికెట్లు బుక్ చేసుకోవడం, ఏర్పాట్లు చేసుకోవడం గట్రా అన్ని అయిపోయాయి. అయితే చివరి నిమిషంలో వచ్చిన షాక్ ఏంటంటే..హుమా భర్తకు వీసా మంజూరు కాలేదు. దీంతో షాక్ తినడం భార్యాభర్తల వంతు అయింది. పోనీ టూర్ రద్దు చేసుకుందామా అని చూస్తే...అవన్నీ నాన్ రిఫండబుల్ కోటావి. దీంతో తొందరగానే తేరుకొని భర్త లేకుండానే హనీమూన్ కు వెళ్లాలని హుమా డిసైడ్ అయింది. అలా భర్త లేకుండానే హనీమూన్ కు గ్రీస్ వెళ్లి హుమా అక్కడ ఎన్నో ఫోటోలు దిగింది. వాటిని తన ఇన్ స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేసింది. అవన్నీ వైరల్ అయ్యాయి.
సోలో హనీమూన్ లో భాగంగా ప్రతి ఫొటోలోనూ తన అదృశ్య భర్తను కౌగిలించుకొని, హత్తుకొని ఉన్నట్లు హుమా ఫొటోలు దిగింది. అంటే తన భర్త అక్కడ ఉన్నట్లుగా భావించి ఆయన కోసం చేతులు చాచి, కౌగిలించుకొని, ఇలా...రకరకాల భంగిమలలో దిగిన ఫోటోలతో ఆమె పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఇంతకీ ఈ ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందంటారా? భర్త కారణంగానే. వ్యాపార పర్యటనల కోసం బుడాపెస్ట్ వెళ్లిన హుమా భర్త అర్సలామ్ తన టూర్లో భార్య లేకపోవడంతో కలత చెంది ఇలా విభిన్నమైన రీతిలో ఫోజు పెట్టి ఫొటోలు దిగాడు. అచ్చూ అదే ఐడియా ఈమె సైతం ఫాలో అయింది. వాటినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దాంతో అవి వైరల్ అయ్యాయి. ఇంతకీ ఎందుకు ఇంతగా ఆమె చిత్రాలు వైరల్ అయ్యాయి అంటే...తన భర్త పక్కన లేకపోయినప్పటికీ ఆయనపై ప్రేమను చాటుకుంటూ ప్రతి ఫొటో ఉండటం వల్ల!