Begin typing your search above and press return to search.
ఓడిన పాక్ లో సిట్యూవేషన్ ఎలా ఉందంటే..?
By: Tupaki Desk | 21 March 2016 4:27 AM GMTటీ20 సిరీస్ లో భాగంగా భారత్.. పాక్ ల మధ్య మ్యాచ్ జరగటం.. దుమ్ము రేపుతూ టీమిండియా అద్భుత విజయం సాధించటం.. భారత ప్రజలు పండగ చేసుకోవటం తెలిసిందే. మరి.. ఓడిన పాక్ లో పరిస్థితి ఎలా ఉంది? ఓటమి తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..? అక్కడి మీడియా ఎలా స్పందించింది? లాంటి ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరాన్ని తాజాగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు గుర్తు చేస్తున్నాయి.
టీమిండియాతో ఓటమి పాక్ ను అట్టుడికిపోయేలా చేసింది. పాక్ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోవటమే కాదు.. పాక్ జట్టుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సగటు జీవి దగ్గర నుంచి మాజీ స్టార్ ఆటగాళ్ల వరకూ పాక్ కెప్టెన్ అఫ్రిదీ తీసుకున్న నిర్ణయాలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక.. మీడియా సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆఫ్రిదీ టీంను తూర్పార పడుతున్నారు.
పాక్ ఓటమితో రగిలిపోయిన పాక్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయటమే కాదు.. పాక్ టీంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇళ్లల్లోని టీవీ సెట్లను వీధుల్లోకి తీసుకొచ్చి ధ్వంసం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పాక్ క్రికెట్ బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పాక్ ఓటమిని కెప్టెన్ అఫ్రీది.. కోచ్ వకార్ యూనిస్ లకు ఖాతాలోకి వేసిన పాక్ ప్రజలు.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు గేమ్ ప్లాన్ వల్లనే మ్యాచ్ ఓడిపోయామంటూ మండిపడుతున్నారు. పిచ్ స్పిన్ కు సహకరిస్తుందని తెలిసినా.. లెగ్ స్పిన్నర్ ఇమాద్ వసీంను తప్పించి.. మరో పేసర్ ను తీసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్ లో అఫ్రీది వన్ డౌన్ లో రావటమేమిటన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.
ఇంత పెద్ద మ్యాచ్ లో నలుగురు పేసర్లతో కాకుండా..సరైన స్పిన్నర్ తో బరిలోకి దిగాల్సి ఉందని.. కానీ.. పాక్ కెప్టెన్ పెద్ద తప్పు చేశారంటున్నారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత్ పై విజయం సాధించటాన్ని ఉదహరిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో పాక్ జట్టు కెప్టెన్ అఫ్రీదీ కెప్టెన్సీకి ముప్పు వచ్చేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సిరీస్ తర్వాత ఆయన కెప్టెన్ పదవి ఊడబీకటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పాక్ ఓటమిపై పాక్ మీడియా ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది.
జట్టు ఎంపిక మొదలు.. పిచ్ ను అంచనావేయటం వరకూ పాక్ కెప్టెన్.. కోచ్ లు తప్పుల మీద తప్పులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రముఖ మీడియా సంస్థలు పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేయగా.. ‘‘ది నేషన్’’ పత్రిక అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా ఆడారంటూ హెడ్డింగ్ పెట్టేయటం గమనార్హం. ది డెయిలీ టైమ్స్ పత్రిక అయితే.. వరల్డ్ కప్ లో రాత మారలేదన్న శీర్షికతో ఓటమి కథనాన్ని అచ్చేసింది. చూస్తుంటే.. పాక్ జట్టు పరిస్థితి పాక్ లో దారుణంగా మారినట్లుందే.