Begin typing your search above and press return to search.
పాక్ ఆర్మీ దుర్మార్గాన్ని కడిగేసిన పాక్ బ్యూటీ
By: Tupaki Desk | 13 Oct 2016 1:58 PM GMTపాకిస్థాన్ లో పరిస్థితులు గతంలో మాదిరి లేవనే చెప్పాలి. ఏం చేసినా.. చెల్లుబాటు అవుతుందన్నట్లుగా వ్యవహరించే పాక్ ప్రభుత్వానికి.. ఆ దేశ ఆర్మీకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల అనంతరం రెండు దేశాల మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలు ఒకపక్క కొత్త అగ్గిని పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే.. పాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అక్కడి మీడియా సైతం ధైర్యంగా ప్రశ్నిస్తున్నాయి. భారత్ జరిపిన సర్జికల్ దాడి అనంతరం పాక్ సర్కారుకు.. పాక్ ఆర్మీకి మధ్య తేడా వచ్చిందన్న వార్తను సాహసోపేతంగా ప్రచురించింది ఆ దేశానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్. దీనిపై నవాజ్ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే.. డాన్ కు మద్దతు పలుకుతూ.. ది నేషన్ అనే మరో మీడియా సంస్థ అండగా నిలవటమే కాదు.. ఉగ్రవాదుల విషయంలో పాక్ ఆర్మీ తప్పుల్ని ఎత్తి చూపటమే కాదు.. ప్రభుత్వ తీరును కడిగిపారేసింది.
ఉగ్రవాదం విషయంలోపాక్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద వైఖరిపై అక్కడి మీడియా ప్రశ్నిస్తున్న వేళ.. దాదాపు ఏడాది కిందటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో ఉగ్రవాదం విషయంలో పాక్ ఆర్మ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఇలాంటి వైఖరి ఏమాత్రం సరికాదంటూ పాక్ కు చెందిన ఒక బ్యూటీ నాన్ స్టాప్ గా కడిగిపారేసిన వీడియో యూట్యూబ్ లో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి.. ఆలస్యం ఎందుకు.. ఆ వీడియోను చూసేయటమే కాదు.. ఆ బ్యూటీ సాహసాన్ని అభినందించండి.