Begin typing your search above and press return to search.

తమిళనాడు ముగ్గుల వెనుక పాకిస్తాన్ హస్తం !

By:  Tupaki Desk   |   3 Jan 2020 5:25 AM GMT
తమిళనాడు ముగ్గుల వెనుక పాకిస్తాన్ హస్తం !
X
దేశం లో కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం పై ఆందోళనలు , నిరసనలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే , తమిళనాడులో కూడా పౌరసత్వ సవరణ చట్టంపై వివిధ రకాలుగా నిరసనలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా సంచలనం రేపింది ఏదైనా ఉందంటే అది ముగ్గుల ద్వారా నిరసన తెలపడం. దీనికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి ఆ తర్వాత వారిని విడుదల చేసారు. ఈ నేపథ్యం లోనే పౌరసత్వ చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో ఒక యువతి వేసిన ముగ్గు వెనుక మర్మం దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఆ యువతికి పాకిస్థాన్‌ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఫేస్‌బుక్‌ పరిశీలనలో తేలిందని గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ తెలిపారు.

పూర్తి వివరాలు చూస్తే... చెన్నైలో గత నెల 29వ తేదీన పలువురు యువతులు ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఈ నేపథ్యంలో ముగ్గులు వేసిన కొందరు యువతులని అరెస్ట్ చేసారు. వీరిలో బిసెంట్‌ నగర్‌ లోని 92 ఏళ్ల వృద్ధుడి ఇంటి ముందు ముగ్గువేసి గొడవలు సృష్టించిన నేరంపై తిరువాన్మి యూర్‌ కు చెందిన గాయత్రి కందదై ని కూడా అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. దీనిపై గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ మాట్లాడుతూ ... ముగ్గు వేసినందుకు యువతులను అరెస్ట్‌ చేయలేదని, ఇతరులు వేసుకున్న సాధారణ ముగ్గు పక్కనే పౌర చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో కూడిన ముగ్గువేయడం వల్లనే అరెస్ట్‌ చేసి కొద్ది సేపటికే విడిచి పెట్టామని కమిషనర్‌ వెల్లడించారు.

అయితే , గాయత్రి కందదై పాకిస్థాన్‌లోని ‘ఫైట్స్‌ పార్‌ ఆల్‌’ అనే సంస్థతో సంబంధాలున్నట్లు ఆమె ఫేస్‌బుక్‌ తనిఖీలో తేలిందన్నారు. ఈ సంస్థకు అసోసియేషన్‌ ఆఫ్‌ అల్‌ పాకిస్థాన్‌ సిటిజన్‌ జెనలిస్ట్‌ అనే సంస్థ కు సొంతమైందని, అంతేగాక ఆమె నేపధ్యాన్ని కూడా అనుమానిస్తున్నామన్నారు. తీవ్రవాద సంస్థలతో గాయత్రికి, ఆమె తండ్రికి ఏమైనా సంబంధాలున్నాయా..? అనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు. ముగ్గులు వేసినందుకు యువతులని అరెస్ట్ చేయడంతో .. ఈ చర్యను నిరసిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్, తుత్తుకుడి ఎంపీ కనిమొళి ఇళ్ల ముందు కూడా ‘వేండం (వుయ్‌ డోంట్‌ వాంట్‌) సీఏఏ-ఎన్‌ ఆర్సీ’ అంటూ ముగ్గులు వేశారు.