Begin typing your search above and press return to search.

ఫేస్‌ బుక్‌ లో అనుచిత వ్యాఖ్య‌లు...మ‌ర‌ణ శిక్ష‌!

By:  Tupaki Desk   |   12 Jun 2017 10:24 AM GMT
ఫేస్‌ బుక్‌ లో అనుచిత వ్యాఖ్య‌లు...మ‌ర‌ణ శిక్ష‌!
X
సాధార‌ణంగా భార‌త్‌లో సోష‌ల్ మీడియాలో ఎవ‌రైనా మ‌తానికి సంబంధించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తే ఏం జ‌రుగుతుంది? మ‌హా అయితే పోలీసులు కేసు న‌మోదు చేసి సాధార‌ణ జైలు శిక్ష విధిస్తారు. అదే పాకిస్థాన్‌ లో అయితే ఏకంగా మ‌ర‌ణ శిక్ష విధిస్తారు.

లాహోర్ కు చెందిన తైమూర్ ర‌జా అనే వ్య‌క్తి ఫేస్‌ బుక్‌ లో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద సందేశాన్ని పోస్ట్ చేశాడు. దీంతో బ‌హ‌వ‌ల్పూర్లోని ఉగ్రవాద వ్య‌తిరేక కోర్టు అత‌డికి మ‌ర‌ణ శిక్షను ఆదివారం విధించింది. అత‌డు పాక్‌ లో మైనారిటీలైన షియా వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. పాకిస్థాన్‌ లో దైవ దూష‌ణ‌ను తీవ్రమైన నేరంగా, ఉగ్ర‌వాదంతో స‌మానంగా ప‌రిగ‌ణిస్తారు. ఆ నేరానికి మ‌ర‌ణ శిక్ష విధిస్తారు.

మహమ్మద్‌ ప్రవక్త, ఆయన భార్యలు - సహచరులను ఉద్దేశించి ర‌జా ప‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ఈ పోస్టు చేసిన‌ట్లు బహవాల్‌ పూర్‌ లోని ఉగ్రవాద నిరోధక కోర్టు పేర్కొంది. సామాజిక మాధ్య‌మాల్లో దైవదూషణ కేసును ఉగ్రవాద నిరోధక కోర్టు విచారించింది. ర‌జా ఒక బ‌స్ స్టాప్‌ లో నిలుచుని త‌న ఫోన్లో విద్వేష‌పూరిత ప్రసంగాలు కూడా చేశార‌ని కోర్టు పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/