Begin typing your search above and press return to search.
పాక్ హెడ్ లైన్స్ లో మోడీని ఏసుకున్నారు
By: Tupaki Desk | 10 Nov 2015 6:09 AM GMTబీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీకి ఏ మాత్రం సంబంధం లేదని బీజేపీ ఎంతగా మొత్తుకున్నా.. ఎవరూ మాట వినని పరిస్థితి. నిజానికి బీహార్ ఎన్నికల్ని మోడీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో అందరికి తెలిసిందే. అందుకే.. అధికారపక్ష మాటను ఏమాత్రం లక్ష్య పెట్టకుండానే.. బీహార్ ఘోర పరాజయానికి మోడీని బాధ్యుడ్ని చేస్తూ దేశీయ మీడియా కంటే విదేశీ మీడియా విరుచుకుపడింది. బీహార్ లో బీజేపీ ఘోర వైఫల్యం మీద ప్రత్యేక కథనాలు.. ఎడిటోరియల్స్ ను రాశారు.
ఇక.. పాకిస్థాన్ లో అయితే.. ఈ కార్యక్రమం మరింత జోరుగా సాగింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ కానీ ఓడిపోతే.. పాక్ లో టపాసులు కాలుస్తారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్య చేసిన నేపథ్యంలో.. బీహార్ ఫలితాన్ని పాక్ మీడియా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. పత్రిక పతాక శీర్షికల్లో మోడీని.. బీజేపీని ఏసుకుంటూ వ్యాఖ్యలు చేసింది.
కొన్ని నెలల తర్వాత భారత్ నుంచి వచ్చిన మొదటి తీపి కబురు బీజేపీ ఓటమి అంటూ పాక్ కు చెందిన ద న్యూస్ ఇంటర్నేషనల్ ఎడిటోరియల్ లో మోడీ మీద తమకున్న అక్కసును వెళ్గగక్కారు. మోడీ ఆవు రాజకీయాలు.. గడ్డి తినటానికి వెళ్లాయి. గోమాంసం మీద ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి ప్రతి స్పందన ఫలితాల్ని బీహర్ అందించింది అంటూ పాక్ లో ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ద డాన్ ఒక వ్యాసంలో పేర్కొంది. బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీ జోరుకు బ్రేకులు వేయటం ఖాయమని.. ఆయన పరపతిని దెబ్బ తీస్తాయన్న విశ్లేషణతో పాక్ మీడియా సంస్థలతో పాటు.. అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలన్నీ తమ ప్రధాన కథనాల్లోనూ.. ఎడిటోరియల్స్ లోనూ పేర్కొనటం గమనార్హం. బీహార్ పరాజయ భారంతో పాటు కిందామీదా పడుతున్న బీజేపీకి.. దేశ..విదేశీ మీడియా మోడీ అండ్ కోను ఓ రేంజ్ లో వేసుకోవటం విశేషం.