Begin typing your search above and press return to search.

బుద్ధిమారని పాకిస్తాన్..ఈసారి డ్రోన్లు పంపించి దొరికిపోయింది

By:  Tupaki Desk   |   4 March 2019 5:05 PM GMT
బుద్ధిమారని పాకిస్తాన్..ఈసారి డ్రోన్లు పంపించి దొరికిపోయింది
X
రెండు రోజుల కిందట వరకు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఇప్పుడిప్పుడే వాతావరణం కుదుటపడుతున్న వేళ పాకిస్తాన్ మరోసారి మన గగనతలంలోకి ప్రవేశించింది. అయితే.. మొన్న ఎఫ్-16 విమానాలను పంపిచిన పాక్ ఈసారి భారీ డ్రోన్లను పంపించి కుటిల దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే.. భారత వాయుసేన పాకిస్తాన్ పన్నాగాన్ని మరోసారి తిప్పికొట్టింది.

రాజస్థాన్‌ లోని భారత-పాక్ సరిహద్దుల్లో మన గగనతలంలో విమానంలాంటిది ఒకటి అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని మన విమానాలు వెంటాడి కూల్చేశాయని రక్షణశాఖ వెల్లడించింది. ఉదయం 11:30 గంటల సమయంలో ఇది భారత గగనతలంలో ఎగురుతూ అనుమానాస్పదంగా కనిపించిందని.. వెంటనే భారత్‌ కు చెందిన యుద్ధ విమానాలు దాన్ని తరుముకుంటూ వెళ్లి కూల్చేశాయని రక్షణ వర్గాలు ప్రకటించాయి. డ్రోన్‌ ను సుఖోయ్ విమానాలు వెంబడించి ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు ప్రయోగించి కూల్చివేయగా అది పాక్ భూభాగంలోని ఇసుక దిబ్బల్లో పడిపోయినందని తెలిపారు.

కాగా ఇప్పటికే పాకిస్తాన్ ఎఫ్-16లతో భారత భూభాగంలోకి ఒకసారి రావడం.. దాన్ని మన మిగ్-21 కూల్చేయడం.. మన మిగ్‌ నూ వారు కూల్చడం - పైలట్‌ ను పట్టుకోవడం - విడిచిపెట్టడం అంతా తెలిసిందే. అంతర్జాతీయ శక్తిమంతమైన దేశాలన్నీ గడ్డిపెట్టడంతో దిగొచ్చి మన పైలట్‌ను విడిచిపెట్టిన పాక్ ఇప్పుడు మళ్లీ ఇలా డ్రోన్లతో దాడికి యత్నించడానికి భారత్ సీరియస్‌ గా తీసుకుంటోంది. ఇండియా మరోసారి ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి అవకాశాలున్నాయని తెలుస్తోంది.