Begin typing your search above and press return to search.
భారతీయ స్త్రీపై పాకిస్తానీ లైంగిక వేధింపులు
By: Tupaki Desk | 16 May 2017 10:31 AM GMTకఠిన చట్టాలకు పెట్టింది పేరు - భద్రత విషయంలో అధిక ప్రాధాన్యం ఇచ్చే గల్ఫ్ దేశాల్లో కూడా మహిళలకు పూర్తి స్థాయి రక్షణ లేదనే ఉదంతం తాజా సంఘటనతో స్పష్టమయింది. గల్ఫ్ దేశాల్లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రమైన దుబాయ్ లో ఓ భారతీయ యువతి లైంగిక వేధింపులకు గురైంది. అది కూడా స్వయంగా తన ఫ్లాట్ సమీపంలోనే కావడం గమనార్హం. విషయం కోర్టుకు చేరి తుది తీర్పు కోసం వేచి ఉంది.
దుబాయిలోని అల్ నహ్ డా అనే ప్రాంతంలో నివసించే ఓ భారతీయ కుటుంబంలో 20 ఏళ్ల యువతి ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. స్థానికంగా ఉన్న కాలేజీలో ఆమె తన విద్య కొనసాగిస్తోంది. అల్ నహ్‌డా సమీపంలోనే 33 ఏళ్ల పాకిస్తాన్ వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఖురాన్ బోధనలకు సంబంధించిన సీడీలు - పుస్తకాలను అమ్ముతున్న సదరు పాకిస్తాన్ వ్యక్తి కొద్ది రోజులుగా ఆ యువతి రాకపోకలను పరిశీలించిన అతడు ఆమెను వేధించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను ఫాలో అయ్యాడు. ఒకరోజు కాలేజీ నుంచి వస్తున్న ఆమెను అనుసరించి వాళ్లు నివసించే ఫ్లాట్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
సదరు భారతీయ యువతి తన అపార్ట్ మెంట్ లోని నాలుగో ఫ్లోర్ లో ఉన్న తన ఫ్లాట్ కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా సదరు పాకిస్తానీ సైతం లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ లో ఎవరూ లేకపోవడంతో ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ అమ్మాయి భయకంపితురాలు అయింది. అయితే నాలుగో ఫ్లోర్ లో లిఫ్ట్ ఓపెన్ కాగానే...ఆమె తండ్రి కనిపించాడు. దీంతో ఆ విద్యార్థినికి కొండంత ధైర్యం వచ్చింది. తండ్రి వద్దకు వెళ్లి ఆ పాకిస్తానీ వల్ల తనకు ఎదురయిన ఇబ్బంది తెలిపింది. దీంతో తండ్రి - కూతురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి దుబాయి కోర్ట్ లో నిందితుడిని ప్రవేశపెట్టారు. అయితే సదరు పాకిస్తానీ ప్లేట్ పిరాయించాడు. తానేమీ తప్పు చేయలేదనీ, ఆమెను కనీసం తాకలేదని కూడా ఆ పాకిస్తాన్ వ్యక్తి కోర్టులో సాక్ష్యం చెప్పాడు. అయితే న్యాయమూర్తి పలు సూటి ప్రశ్నలు అడగి ఆయన తప్పుడు ప్రవర్తనపై ఆరాతీశారు. ఈ నెల 25కి తీర్పు వెలువడనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/