Begin typing your search above and press return to search.

చైనా-ఇండియా సీక్రెట్ డీల్.. పాక్ అనుమానం

By:  Tupaki Desk   |   18 Nov 2016 7:34 AM GMT
చైనా-ఇండియా సీక్రెట్ డీల్.. పాక్ అనుమానం
X
పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్సులో గ్వాదార్ పోర్టును చైనా నిర్మిస్తోంది... పాక్ కు దాదాపు 80 శాతం డిఫెన్సు సపోర్టు ఇస్తోంది. మరోవైపు జియోపాలిటిక్సులో భాగంగా ఇండియా - చైనాల మధ్య ప్రచ్చన్న వైరుధ్యాలున్నాయి. కానీ.. ఇదంతా బయటకు కనిపిస్తున్నసీను అని.. మోడీ నేతృత్వంలోని భారత్.. చైనాతో మంచి సంబంధాలు నెరుపుతోందని పాక్ ఇప్పుడు అనుమానిస్తోందట. ఏదైనా తన ప్రయోజనాల కోసమే చేసే చైనా తన వ్యాపారాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మాన్యుఫేక్చరింగ్ కంట్రీ అయిన చైనా నుంచి ఉత్పత్తులను బ్యాన్ చేయాలని ఇండియాలో డిమాండ్లు పెరుగుతున్న సమయంలో చైనా భారత్ తో మంచి సంబంధాల కోసం తెగ ప్రయత్నిస్తోందని పాక్ ఎంపీలు కొందరు అనుమానిస్తున్నారు. తమకు మిత్ర దేశంలా వ్యవహరిస్తున్న చైనా వైపు అపనమ్మకంతో చూస్తున్నారు.

ముఖ్యంగా చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా నిర్మితమైన ఎకనామిక్ కారిడార్ వల్ల తమ దేశం కన్నా ఇండియాకు ఎక్కువ లాభం చేకూరుతుందని పాక్ ఎంపీలు భయపడుతున్నారు. చైనా ఓ పథకం ప్రకారం ఎకనామిక్ కారిడార్ ను భారత్ తో వాణిజ్యాన్ని విస్తరించుకునేందుకు వాడుకుంటుందని, పాక్ తో పోలిస్తే భారత్ తో చైనా వాణిజ్యం ఎన్నో రెట్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని అక్కడి ప్రజా ప్రతినిధులు అంటున్నారు.

దాదాపు 46 బిలియన్ డాలర్లతో 2,442 కిలోమీటర్ల పొడవున చైనా సరిహద్దుల నుంచి పాకిస్థాన్ లోని గ్వదార్ నౌకాశ్రయం వరకూ ఈ కారిడార్ నిర్మితమైన సంగతి తెలిసిందే. దీనిపై రీసెంటుగా పాక్ నేషనల్ అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎంపీలు దీనిపై మండిపడినట్లు సమాచారం. సీపీఈసీ ప్రాజెక్టులో చైనా భారీ పెట్టుబడుల వెనుక భవిష్యత్ వ్యూహాలు ఉన్నాయని ఎంపీలు వ్యాఖ్యానించారని 'డాన్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పాక్ తో చైనా మైత్రి అంతా నటన అని కొందరు ఎంపీలు అన్నట్లుగా డాన్ వెల్లడించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/