Begin typing your search above and press return to search.

పాక్ బార్డ‌ర్‌ లో భ‌గ‌వ‌ద్గీత ఎందుకు సంచ‌ల‌నంగా మారిందంటే

By:  Tupaki Desk   |   6 Nov 2018 1:30 AM GMT
పాక్ బార్డ‌ర్‌ లో భ‌గ‌వ‌ద్గీత ఎందుకు సంచ‌ల‌నంగా మారిందంటే
X
భార‌తీయులు - ప్ర‌ధానంగా హిందువులు ఆలోచ‌న‌లో ప‌డే ప‌రిణామం ఇది. 16 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన పాకిస్థాన్ జాతీయుడు త‌న జైలు జీవితానికి విముక్తి సంద‌ర్భంగా తీసుకున్న నిర్ణ‌యం ఇరు దేశాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. హిందువులు శ‌తాబ్ధాలుగా ఆరాధించే భ‌గ‌వ‌ద్గీత ఆయ‌న చేతిలో ఉంది. అలా బార్డ‌ర్‌ లో భ‌గ‌వ‌ద్గీత ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది.

పాకిస్థాన్‌ లోని సింధూ ప్రావిన్స్‌ కు చెందిన జలాలుద్దీన్.. 2001లో యూపీలోని కంటోన్ మెంట్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. దీంతో జలాలుద్దీన్‌ ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న కంటోన్ మెంట్‌ కు సంబంధించిన ఫోటోలతో పాటు ఇతర విలువైన సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జలాలుద్దీన్‌ కు 16 ఏళ్ల జైలు శిక్ష విధించారు. క‌ట్ చేస్తే...జ‌లాలుద్దీన్‌ జైలు శిక్ష నిన్న పూర్తి అయింది. దీంతో జలాలుద్దీన్‌ ను విడుదల చేశారు. ప్రత్యేక అధికార బృందం వాఘా సరిహద్దు వద్ద పాక్ పోలీసులకు జలాలుద్దీన్‌ ను అప్పగించారు. వారణాసి సెంట్రల్ జైలు లో ఖైదీగా ఉన్న సమయంలోనే ఆయన ప్రతి రోజూ భగవద్గీత చదివేవాడు. అంతే కాకుండా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా సాధించాడు. ఇక ఎలక్ట్రిషీయన్ కోర్సులో ఉత్తీర్ణత పొందాడు. గత మూడేళ్ల నుంచి జైలు క్రికెట్ లీగ్‌ కు అంపైర్‌ గా వ్యవహరించారు జలాలుద్దీన్. జైలు నుంచి బయటకు వచ్చిన జలాలుద్దీన్ చేతిలో భగవద్గీత ఉంది. ఆ భగవద్గీతతోనే పాక్‌ కు ప్రయాణమయ్యాడు జలాలుద్దీన్. ఇలా బార్డ‌ర్‌ లో భ‌గ‌వ‌ద్గీత హాట్ టాపిక్ అయింది.