Begin typing your search above and press return to search.
మీరు చదివేది కరెక్టే.. టీమిండియా గెలుపు కోసం ప్రార్థిస్తున్న పాక్ ప్రజలు
By: Tupaki Desk | 30 Oct 2022 8:20 AM GMTఆట ఏదైనా.. జట్టు మరేదైనా.. టీమిండియా గెలుపు కోసం పాక్ ప్రజలు ప్రార్థనలు చేయటం ఎప్పుడైనా చూశారా? కానీ.. ఈసారి మాత్రం అలాంటి సీన్ ఆవిష్క్రతమైంది. తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఇలాంటి విచిత్ర ఉదంతం చోటు చేసుకుంది. దీనికి కారణం టీమిండియా మీద పాక్ ప్రజలకు అకస్మాత్తుగా ప్రేమ పొంగుకు రాలేదు. తాజాగా జరిగే మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధిస్తేనే.. పాక్ జట్టు సెమీస్ లోకి చేరే అవకాశం ఉంటుంది. అందుకే.. పాక్ ప్రజలు ఇప్పుడు టీమిండియా విజయం సాధించాలని.. టోర్నీలో తమ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్నారు. అందుకే.. టీమిండియా ఎదుర్కొనే దక్షిణాఫ్రికా.. జింబాబ్వే.. బంగ్లాదేశ్ ల మీద జరిగే మ్యాచ్ లలో వరుస విజయాల్ని సాధించాల్సి ఉంది.
అప్పుడే పాక్ జట్టుకు సెమీస్ కు అవకాశాలు ఉంటాయి. ఈ మూడు జట్లతో జరిగే మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధిస్తే.. స్కోర్ బోర్డులో పాక్ కు లభించిన పాయింట్లు.. ఆ జట్టును సెమీస్ కు వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. భారత్.. జింబాబ్వే లతో జరిగిన మ్యాచ్ లలో పాక్ జట్టు ఓటమి పాలైంది. దీంతో.. గ్రూప్ లో పాక్ జట్టు చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్.. నెదర్లాండ్స్ జట్లను వరుస పెట్టి ఓడించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓడించినా.. సమీకరణాలు కుదరకుంటే సెమీస్ కు బెర్తు లభించే వీలు ఉండదు. అదే సమయంలో భారత క్రికెట్ జట్టు మాత్రం తాను ఎదుర్కొనే మిగిలిన మూడు మ్యాచ్ లలో వరుస విజయాల్ని సాధిస్తే మాత్రం పాక్ జట్టుకు సెమీస్ కు వెళ్లే ఛాన్సు ఉంటుంది. అందుకే భారత జట్టు విజయం కోసం పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరో విషయం ఏమంటే.. బారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్ జట్టును ఢీ కొనాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ లో కానీ ఓడితే పాక్ జట్టు సెమీస్ ఆశలు ఆడియాశలు అయినట్లే. దారులన్నీ మూసుకుపోతాయి. మరేం జరుగుతుందో చూడాలి.