Begin typing your search above and press return to search.

త‌న పైలెట్ ను తానే చంపేసుకున్న పాకిస్థాన్

By:  Tupaki Desk   |   3 March 2019 5:06 AM GMT
త‌న పైలెట్ ను తానే చంపేసుకున్న పాకిస్థాన్
X
దాయాది దుష్టబుద్ధి.. వారినే దెబ్బ తీసింది. సొంత గ‌డ్డ మీద సొంత పైల‌ట్ ను చంపుకున్న అపప్ర‌ధ పాకిస్థానీయులు మూట‌క‌ట్టుకున్నారు. పాక్ ప్ర‌జ‌లు శ‌త్రువులుగా భావించే భార‌త్ పైల‌ట్ క‌మ్ వింగ్ క‌మాండర్ అభినంద‌న్ ను పాకిస్థానీయుల చెర నుంచి త‌ప్పించి.. త‌మ అదుపులోకి తీసుకోగా.. పాక్ పైల‌ట్ ను మాత్రం భార‌త పైల‌ట్ అన్న సందేహంతో చంపేసిన వైనం కాసింత ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పాక్ ప్ర‌జ‌ల‌కు చిక్కిన అభినంద‌న్ పై దాడి జ‌రుగుతున్న‌ప్పుడే పాక్ సైనికులు రావటం.. అత‌డ్ని ర‌క్షించ‌టం.. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో అత‌డు స్వ‌దేశానికి క్షేమంగా తిరిగి రావ‌టం.. యావ‌త్ భార‌తావ‌ని ఆనందంతో పండ‌గ చేసుకోవ‌టం తెలిసిందే. అదే స‌మ‌యంలో.. భార‌త్ లోని ఆయుధ‌గారాల మీద దాడుల‌కు య‌త్నించి.. కుద‌ర‌క తిరిగి వెళుతున్న యుద్ధ విమానాన్ని అభినంద‌న్ కూల్చేయ‌టం.. అందులోని పైల‌ట్ పారాచ్యూట్ సాయంతో కింద‌కు దిగారు.

తాను ల్యాండ్ అయ్యింది పాకిస్థాన్ లోనే అయిన‌ప్ప‌టికి పైల‌ట్ షాజుద్దీన్ కు తాను సేఫ్ కాద‌న్న విష‌యం కాసేప‌టికి కానీ అర్థం కాలేదు. అత‌డు భార‌త పైల‌ట్ అని భావించిన స్థానికులు అత‌డ్ని తీవ్రంగా కొట్టి చంపారు. పీవోకేలోని నౌషేరా స‌మీపంలోని లీమ్ లోయ‌లో దిగిన షాజుద్దీన్ ను అక్క‌డి స్థానికులు దిగీ.. దిగ‌గానే తాను ఎవ‌రో చెప్పుకునే అవ‌కాశం ఇవ్వ‌కుండా దాడి చేయ‌టం.. అత‌డు ఆ దాడిలో మ‌ర‌ణించ‌టంతో పాక్ కు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ విష‌యాన్ని చెప్పుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ కార‌ణంతోనే పాక్ పైల‌ట్ షాజుద్దీన్ మ‌ర‌ణ‌వార్త కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట ప్ర‌పంచానికి అందింది.