Begin typing your search above and press return to search.

రాజ‌కీయ పార్టీ పెట్టిన ఉగ్ర‌వాది

By:  Tupaki Desk   |   8 Aug 2017 6:51 AM GMT
రాజ‌కీయ పార్టీ పెట్టిన ఉగ్ర‌వాది
X
రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించాడో క‌ర‌డుక‌ట్టిన ఉగ్ర‌వాది హ‌ఫీజ్ స‌యిద్‌. ప్ర‌స్తుతం పాకిస్థాన్ లో హౌస్ అరెస్ట్ లో ఉన్న ఈ ముంబ‌యి పేలుళ్ల ప్ర‌ధాన సూత్ర‌ధారి త‌న సంచ‌ల‌న నిర్ణ‌యంతో పాక్ లోని రాజ‌కీయ పార్టీలు ఉలిక్కిప‌డేలా చేశాడు. తాను నెల‌కొల్పిన మ‌త సంస్థ జ‌మాత్ ఉల్ ద‌వాకు కొన‌సాగింపుగా కొత్త రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశార‌ని చెప్పాలి. పార్టీని ఏర్పాటు చేసిన విష‌యాన్ని స‌యిద్ ప్ర‌ధాన అనుచ‌రుడు సైఫుల్లా ఖ‌లీద్ ఇస్లామాబాద్ లో తాజాగా వెల్ల‌డించారు.

మిల్లి ముస్లిం లీగ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ కొత్త రాజ‌కీయ పార్టీ లక్ష్యం పాకిస్థాన్‌ ను అస‌లైన ఇస్లామిక్ రాజ్యంగా మార్చ‌టం. హ‌ఫీజ్ స‌యిద్ గృహ నిర్భందం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కూ తాను పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా సూఫుల్లా ప్ర‌క‌టించారు.

2018 లో జ‌రిగే పాక్ ఎన్నిక‌ల్లో ఇస్లామిక్ స్టేట్ అజెండాతో ఉన్న రాజ‌కీయ పార్టీల‌తో భారీ కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ కు చెందిన స‌యిద్ కు.. సొంత రాష్ట్రమైన సింధ్ లో భారీ మ‌ద్ద‌తు ఉంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ త‌న ప్ర‌భావాన్ని చూపించేలా స్థానిక రాజ‌కీయ పార్టీల‌తో చెట్టాప‌ట్టాలు వేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. హ‌ఫీజ్ ప్ర‌భావాన్ని చూపిస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఉగ్ర‌వాద బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాజ‌కీయ పార్టీలకు చెక్ పెట్టేలా ఉన్న ప్ర‌గ‌తిశీల పార్టీలుగా పేరున్న న‌వాజ్ ష‌రీఫ్ కుటుంబానిక చెందిన పీఎల్ ఎం.. భుట్టోకుటుంబానికి ఉన్న పీపీపీ.. ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ.. అబ్దుల్ వ‌లీకి చెందిన ఏఎన్ పీ లాంటి పార్టీల న‌డుమ ఉగ్ర‌వాది పార్టీని పాక్ ప్ర‌జ‌లు ఎంత మ‌ద్ద‌తు ఇస్తార‌న్న‌ది కాలమే స‌రైన స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.