Begin typing your search above and press return to search.
వాడ్ని వదిలేస్తే పాక్ కు వెళ్లి చంపేస్తాడట
By: Tupaki Desk | 18 Aug 2015 4:36 AM GMTకాశ్మీర్ లోయలో బీఎస్ ఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి.. ఉధంపూర్ గ్రామస్థుల సాహసంతో చేతికి చిక్కిన ఉగ్రవాది నవీద్ చేసిన వ్యాఖ్యలు తాజాగా బయటకు వచ్చాయి. లష్కరే తోయిబాకు చెందిన ఈ ఉగ్రవాది తడవకో మాట చెబుతూ.. దర్యాప్తు అధికారుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని రహస్య స్థలంలో అతన్ని విచారిస్తున్న అధికారులకు ఓ మాట చెప్పి కాస్తంత ఆశ్చర్యం కలిగించాడట.
భారత్ లో పట్టుబడిన రోజున.. ‘‘హిందువులను చంపటం నాకెంతో ఇష్టం’’ అంటూ మాటలు పేలిన నవీద్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన వాణిని వినిపిస్తున్నాడట. తనను దయచేసి వదిలిపెట్టాలని.. పాక్ కు వెళ్లి.. తనను భారత్ కు పంపిన వారందరిని చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడని అతన్ని విచారిస్తున్న అధికారులు చెబుతున్నారు.
తన మనసులో విషాన్ని నింపి.. భారత్ కు పంపటంలో కీలకభూమిక పోషించిన తన గురువును తాను చంపేస్తానని.. తనకు పాకిస్థాన్ కు వెళ్లే అవకాశం ఇవ్వాలంటూ పేర్కొనటం గమనార్హం. మూడ అంచెల్లో శిక్షణ ఇచ్చి.. ఆత్మాహుతి దళంగా తయారు చేస్తారని.. ఆత్మాహుతి దళ సభ్యునిగా తయారు చేసే క్రమంలో.. ఇండియాలో ముస్లింలు.. మరి ముఖ్యంగా కాశ్మీర్ లోని ముస్లింలు పడే బాధల్ని చూపిస్తారని.. భారత్ అంటే అగ్రహం కలిగించేలా చేస్తారని చెప్పినట్లుగా చెబుతున్నారు. తాను మోసపోయానని.. తనను తప్పదారి పట్టించారని.. అందుకు శిక్షగా తనను వదిలేస్తే.. తనను భారత్ కు పంపిన వారందరిని చంపేస్తానంటూ దర్యాప్తు అధికారులకు ఆఫర్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తున్నాడట.