Begin typing your search above and press return to search.
నిజంగా సల్మాన్ కోసమే వచ్చిందా?
By: Tupaki Desk | 1 Aug 2015 4:14 AM GMTసినిమావాళ్లపై అభిమానం ఉంటుంది... దానికి హద్దులు కూడా ఉండవని తెలుసు! కానీ... అన్ని హద్దులు లాంటిది కాదు భారత్ - పాక్ హద్దు! ఈ విషయాన్ని మరిచిందో లేక కావాలనే చేసిందో అదీ కాక మరో ఉద్దేశ్యంతో వచ్చిందో తెలియదు కానీ... సల్మాన్ ఖాన్ అభిమానిని అని, అతడిని చూడటానికని దొంగచాటుగా ఒక మహిళ భారతదేశం వచ్చేసింది! మరి మన సెక్యూరిటీ ఆ స్థాయిలో ఉందా? అనే విషయం కాసేపు పక్కన పడితే! వచ్చినామె అభిమాని అని చెబుతున్నా... పాకిస్థాన్ నుండి రావడంతో పరిస్థితి కాస్త సీరియస్ అయ్యింది! ప్రస్తుతం పంజాబ్ లో తాజాగా ఉగ్రవాద దాడులు, మరోవైపు దేశం మొత్తం ఉగ్రవాదంపై చర్చలు, మరోవైపు మెమన్ ఉరి... ఈ పరిస్థితుల్లో పాక్ నుండి ఒక మహిళ సినిమా హీరో అభిమానిని అని చెప్పి ఇలా దొడ్డిదారిన రావడం ఆసక్తిని, అనుమానాన్ని రేకెత్తిస్తుంది!
ఇప్పటికే ఉగ్రవాదుల దాడితో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్ పోలీసులకు కరాచీకి చెందిన 27 ఏళ్ల చందాఖాన్ అనే యువతి చుక్కలు చూపించింది. ఈమె మాట, ప్రవర్తన, చెబుతున్న విషయాలు, పొంతన లేని సమాధానాలు చూసిన పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు! ఆఖరికి అభిమానిని అని చెబుతున్నా... ముందు మాత్రం... తన కొడుకు కోసం అల్లాను ప్రార్థించడానికి ఢిల్లీలోని దర్గాకు వెళ్తున్నానని చెబితే... మరోసారి తప్పిపోయిన తన అంకుల్ ని వెతుకుతున్నానని చెప్పింది! ఇదే క్రమంలో చివరిగా హీరో సల్మాన్‌ఖాన్ కోసం వచ్చానని చెప్పడంతో... పొంతనలేని సమాధానాలవల్ల పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఆమెవద్ద నుంది కేవలం రూ. 771 పాక్‌కు చెందిన మనీ మాత్రమే వుంది! దేశం దాటి దేశం రావడానికి అవసరమైన పాస్ పోర్ట్ కానీ, కనీసం టిక్కెట్ కానీ ఆమెవద్ద లేకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు! ఈమె నిజంగానే అభిమానా, లేక మతిస్థిమితం కోల్పోయిన మహిళా, అదీకాక టెర్రరిస్టా అనేది తెలియాల్సి ఉంది!