Begin typing your search above and press return to search.
పుల్వామా ఘటనపై పాక్ అమ్మాయి చాలెంజ్
By: Tupaki Desk | 21 Feb 2019 11:15 AM GMTపుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 43మంది భారత సైనికులు చనిపోయినప్పటి నుంచి అందరి కళ్లు పాకిస్తాన్ వైపే.. దాయాది దేశం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగానే భారత్ ఈ మూల్యం చెల్లించుకుంది. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాలుగు రోజుల తర్వాత తమ తప్పు లేదని.. కావాలంటే ఆధారాలు చూపించాలంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. పాకిస్తాన్ చేసిన ఈ దుర్మార్గాన్ని కప్పిపుచ్చేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కిందా మీద పడుతున్న వేళ.. పాకిస్తాన్ కు చెందిన ఒక మహిళ భిన్నంగా స్పందించడం సంచలనంగా మారింది.
పుల్వామా ఉగ్రవాద దాడిలో భారత సైనికుల మరణానికి ఆమె కదిలిపోవడమే కాదు.. కన్నీరు కార్చింది. భారతీయురాలు కాకున్నా.. మానవత్వంతో ఆమె చేస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. విశేషం ఏంటంటే ఆమె పాకిస్తాన్ కు చెందిన అమ్మాయే కావడం గమనార్హం. సెహీర్ మీర్జా అనే జర్నలిస్టు భారత్ సైనికులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది.
భారత్ కు మద్దతుగా ఈ పాకిస్తాన్ అమ్మాయి ‘యాంటీ హీట్ చాలెంజ్’ను ఫేక్ బుక్ లో చేపట్టింది. దేశభక్తి కోసం మానవత్వాన్ని తాకట్టు పెట్టలేం అంటూ తన ఫేస్ బుక్ పేజీలో రాసుకున్న ఆమె దానికింద పాకిస్తాన్ అమ్మాయిని.. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఫ్లకార్డుతో ఉన్న ఫొటోను షేర్ చేసింది.
భారత్ కు మద్దతుగా పుల్వామా దాడిని ఖండించాలని ఆమె పిలుపునివ్వడం పాకిస్తాన్ తోపాటు భారత్ లో సంచలనమైంది. పాకిస్తాన్లోని చాలామంది ఆమె ప్రచారాన్ని కొనియాడుతున్నారు. ఇరుదేశాల మధ్య గొడవలు సద్దుమణిగి శాంతి నెలకొనాలని చూస్తున్న సెహీర్ చేస్తున్న ఆన్ లైన్ ప్రచారంపై ప్రశంసలు కురుస్తున్నాయి.