Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ వాళ్ళు మనకంటే ఆనందంగా ఉన్నారట!

By:  Tupaki Desk   |   29 April 2016 5:30 PM GMT
పాకిస్తాన్ వాళ్ళు మనకంటే ఆనందంగా ఉన్నారట!
X
పాకిస్తాన్ గురించి ప్ర‌పంచానికి - ప్ర‌త్యేకంగా భార‌తీయుల‌కు ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. నిర‌క్ష‌రాస్య‌త‌ - తీవ్ర‌వాదం - స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం - ప్ర‌జాస్వామ్య స్పూర్తి లోపించ‌డం వంటివి ఆ దేశానికి మారుపేరుగా నిలుస్తాయి. కానీ భార‌త్ విష‌యంలో అలాంటివేమీ లేవు. స్వేచ్చ‌వాయువుల‌ను పీల్చుకుంటూ - న‌చ్చిన జీవితం గ‌డిపే సౌల‌భ్యం మ‌న‌దేశంలో ఉంది. అయితే ఈ అంచాన‌ల‌కు భిన్నంగా తాజాగా ఓ స‌ర్వే వెలువ‌డింది. భారతీయులకంటే పాకిస్తాన్ లోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని ఆ స‌ర్వే తేల్చింది.

ఐక్య‌రాజ్య‌స‌మితికి నిర్వ‌హించిన ఒక సర్వేలో పాకిస్తాన్ మనకంటే ముందు ఉందట. చ‌క్క‌టి జీవ‌న విధానం - ఆర్థిక భ‌రోసా వంటి అంశాల ఆధారంగా 157 దేశాల లిస్టులో భారత్ 118వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 92వ స్థానంలో ఉంది. అయితే ఈ రెండు దేశాలు గత ఏడాది కంటే మరింత దిగజారాయి. పోయిన ఏడాది పాకిస్తాన్ 81వ పొజిషన్ లో ఉంటే.. భారత్ 117వ పొజిషన్ లో ఉంది. సోషల్ సపోర్ట్ - మంచి జీవన విధానం మరియు రాబడి లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వేను రూపొందించారు. ఈ లిస్టులో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది.

ఈ స‌ర్వేను ఐక్య‌రాజ్య‌స‌మితి చేప‌ట్టిన‌ప్ప‌టికీ ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పాక్ పౌరులే ఆ దేశ పాలకుల తీరుప‌ట్ల అసంతృప్తితో ఉంటే భార‌త్ కంటే ముందుండ‌టం ఏమిటని ఆశ్చ‌ర్య చ‌కితులు అవుతున్నారు.