Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో పాకిస్తాన్ విద్యార్థులను కాపాడిన భారత జెండా

By:  Tupaki Desk   |   3 March 2022 4:36 AM GMT
ఉక్రెయిన్ లో పాకిస్తాన్ విద్యార్థులను కాపాడిన భారత జెండా
X
భారత ప్రతిష్ట, గౌరవం అంతర్జాతీయంగా ఇనుమడిస్తోంది. భారతీయులనే కాదు.. పాకిస్తాన్, టర్కీ పౌరులను కూడా ఆ దేశ సరిహద్దులకు సురక్షితంగా వెళ్లేందుకు సాయం చేస్తోంది. ఈ విషయాన్ని అక్కడి నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులే వెల్లడించారు.

ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు పాకిస్తాన్, టర్కీ విద్యార్థులు భారత జాతీయజెండాను ఉపయోగించుకుంటున్నారు. ఆ దేశంలోని భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. వాటిని అందుకునేందుకు హంగరీ, రొమేనియా సరిహద్దులకు భారత జెండాలతో రావాలని భారతీయ విద్యార్థులకు కేంద్రం సూచించింది. దీంతో ఈ సూచనతో భారత విద్యార్థులే కాదు.. పాకిస్తాన్, టర్కీ విద్యార్థులు కూడా ప్రాణభయంతో మన భారత జెండాలను పట్టుకొని ప్రాణాలు దక్కించుకుంటున్నారు.

ఉక్రెయిన్ నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్ నగరానికి చేరుకున్న భారతీయ విద్యార్థులు మాట్లాడుతూ యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితులతో ఉక్రెయిన్ లోని వివిధ చెక్ పోస్టులను సురక్షితంగా దాటడంతో జాతీయ త్రివర్ణ పతాకం తమతో పాటు కొంతమంది పాక్, టర్కీ విద్యార్థులకు తోడ్పడిందని చెప్పారు.

ఆపరేషన్ గంగ ద్వారా భారతీయ విద్యార్థులను తరలించేందుకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు. తాజాగా వాయుసేనకు చెందిన సీ17 విమానాలు రంగంలోకి దిగాయి.